జాతీయ వార్తలు

నేడు సార్వత్రిక సమ్మె

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 1: తమ డిమాండ్ల సాధనకోసం దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు శుక్రవారంనాడు జరపనున్న సార్వత్రిక సమ్మె ప్రభావం దాదాపు అన్ని రంగాలపైనా తీవ్ర స్థాయలో ప్రతిబింబించే అవకాశం కనిపిస్తోంది. నిత్యావసర సర్వీసులు ఎలాంటి విఘాతం కలగకుండా చూడాలని ప్రభుత్వం సంబంధిత విభాగాలన్నిటినీ అప్రమత్తం చేసింది. బ్యాంకులు, ప్రజా రవాణాలాంటి నిత్యావసర సర్వీసులు, ప్రభుత్వ రంగ సంస్థల్లో కార్యకలాపాలు స్తంభించి పోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆర్‌ఎస్‌ఎస్‌కు అనుబంధంగా ఉన్న భారతీయ మజ్దూర్ సంఘ్ తప్పించి మిగతా ప్రధాన కార్మిక సంఘాలన్నీ ఈ సమ్మెలో పాల్గొంటున్నట్లు ప్రకటించాయి. రెండేళ్ల బోనస్ చెల్లింపు, కనీస వేతనం పెంపులాంటి ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన చర్యలు తమ డిమాండ్లను నెరవేర్చడానికి ఎంతమాత్రం సరిపోవని పేర్కొంటూ ఆ కార్మిక సంఘాలు సమ్మెను కొనసాగించడానికే నిర్ణయించాయి. అయితే సమ్మె కారణంగా అత్యవసర సర్వీసులకు ఎలాంటి అంతరాయం కలగకుండా చూడడానికి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం మరోవైపు అన్ని మంత్రిత్వ శాఖలను ఆదేశించింది. తమ మంత్రిత్వ వాఖల పరిధిలోకి వచ్చే అన్ని సేవలు సాఫీగా సాగడానికి తగు చర్యలు తీసుకోవాలని అన్ని విభాగాల కార్యదర్శులను ఆదేశించడం జరిగింది.
కాగా, గత ఏడాది జరిగిన సమ్మెకన్నా ఈ సమ్మె చాలా తీవ్రంగా ఉంటుందని, సమ్మెలో పాల్గొనే కార్మికుల సంఖ్య 18 కోట్ల దాకా ఉంటుందని కార్మి సంఘాల నేతలు అంటున్నారు. గత ఏడాది జరిగిన సార్వత్రిక సమ్మెలో 14కోట్ల మంది పాల్గొన్నట్లు అప్పట్లో కార్మిక సంఘాలు చెప్పుకొన్నాయి. కనీస వేతనాన్ని 18 వేలకు పెంచడం, ధరల పెరుగుదలను అదుపు చేయడం, కనీస నెలవారీ పింఛను 3 వేలు ఉండేలా చూడడంలాంటి తమ 12 డిమాండ్లను నెరవేర్చడంలో ప్రభుత్వం ఉదాసీనతకు నిరసనగా తాము ఈ సమ్మె చేస్తున్నట్లు కార్మిక సంఘాలు చెప్తున్నాయి. రవాణా, టెలికాం, బ్యాకింగ్ లాంటి అత్యవసర సేవా రంగాలతోపాటుగా రేవులు, పౌరవిమానయానం లాంటి రంగాలకు చెందిన కార్మికులు కూడా ఈ సమ్మెలో పాల్గొంటున్నాయని ట్రేడ్ యూనియన్ కోర్డినేషన్ కమిటీ ప్రధాన కార్యదర్శి ఎస్‌పి తివారీ చెప్పారు.
వామపక్షాల మద్దతు
హైదరాబాద్: శుక్రవారం జరగనున్న అఖిల భారత సార్వత్రిక సమ్మెకు వామపక్షాలు మద్దతు ప్రకటించాయి. సిపిఐ, సిపిఎం పార్టీలు సమ్మెను విజయవంతం చేయాలని, ప్రజాసంఘాలతో కలసి ఎఐటియుసి, సిఐటియు వాటి అనుబంధ సంఘాలు ఈ సార్వత్రిక సమ్మెలో పాల్గొంటాయని సిపిఐ, సిపిఎం రాష్ట్ర కార్యదర్శులు చాడ వెంకటరెడ్డి, తమ్మినేని వీరభద్రం తెలిపారు. సార్వత్రిక సమ్మెను ప్రజాసంఘాలతోపాటు కార్మిక సంఘాలు విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు.