జాతీయ వార్తలు

సిగరెట్ కంపెనీల మూత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 1: సిగరెట్ ప్రియులకు ఓ షాక్. సిగరెట్ పెట్టెలపై 85 శాతానికి పైగా హెచ్చరికల బొమ్మలను ముద్రించాలన్న కేంద్ర ఆదేశంతో ఐటిసి, గాడ్‌ఫ్రే, ఫిలిప్స్, విఎస్‌టి వంటి సంస్థలు తమ ఫ్యాక్టరీలను శుక్రవారం నుంచి మూసివేశాయి. సిగరెట్ తాగడం వల్ల ఆరోగ్యానికి హానికరం అంటూ హెచ్చరికలు చేస్తున్నా ప్రయోజనం లేకపోవడంతో, అందుకు సంబంధించిన బొమ్మలను ప్యాకెట్లపై 85శాతం స్థలం ఆక్రమించేలా ముద్రించాలని కేంద్రం ఆదేశించడంతో ఈ నిర్ణయం తీసుకున్నాయి. దేశంలో 98 శాతానికిపైగా సిగరెట్ విక్రయాలు ఈ సంస్థల ద్వారానే సాగుతున్నాయి. తమ సంస్థలను మూసివేయడం వల్ల రోజుకు 350 కోట్లమేర నష్టం వాటిల్లుతుందని వెల్లడించాయి. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో ఇంకెంతమాత్రం తాము సిగరెట్లను ఉత్పత్తి చేయలేమని భారత పొగాకు సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ హెచ్చరిక బొమ్మలపై వివరణ ఇవ్వాలంటూ కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖకు భారత పొగాకు పరిశ్రమ లేఖ కూడా రాసింది. సిగరెట్ పెట్టెలపై 85 శాతానికి పైగా హెచ్చరికల బొమ్మలు ముద్రించాలన్నది తీవ్రమైన నిర్ణయమని, దీన్ని 50శాతానికి పరిమితం చేయాలని అనుబంధ శాసనంపై ఏర్పాటైన పార్లమెంటరీ కమిటీ స్పష్టం చేసింది. అయితే దీనిపై అటు ఎంపీలు, ఇటు ఆరోగ్య నిపుణులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, సిగరెట్ కంపెనీలను మూసివేయడం వల్ల రైతులు సహా దాదాపు 4.7 మిలియన్ మంది ప్రజల జీవనోపాధికి విఘాతం కలుగుతుందని భారత టుబాకో సంస్థ తెలిపింది.