జాతీయ వార్తలు

ట్రిపుల్ తలాక్‌పై మళ్లీ బిల్లు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 11: ట్రిపుల్ తలాక్ అంశంపై మళ్లీ ‘తెర’పైకి వస్తోంది. బుధవారం జరగబోయే కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ట్రిబుల్ తలాక్‌పై మళ్లీ కొత్తగా బిల్లును తీసుకుని వచ్చే అంశంపై చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. త్రిపుల్ తలాక్‌తో ముస్లిం మహిళలు ఎదుర్కొంటున్న సమస్య నుంచి విముక్తి కల్పించాలన్న భావనతో గత లోక్‌సభ (16వ లోక్‌సభ) సమావేశాల్లో ట్రిబుల్ తలాఖ్‌ను తొలగిస్తూ ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆ బిల్లును రాజ్యసభకు పంపించడం జరిగింది. అయితే ఆ బిల్లుకు రాజ్యసభలో ఆమోద ముద్ర పడక ముందే 16వ లోక్‌సభ రద్దు అయ్యింది. లోక్‌సభ రద్దు కావడంతో ఆ బిల్లు జీవత్వాన్ని కోల్పోయింది. సాంకేతికంగా ఇక్కడ ఒక విషయం ఏమిటంటే లోక్‌సభలో ఏ బిల్లు అయినా ఆమోదం పొంది, రాజ్యసభలో పెండింగ్‌లో ఉన్న సమయంలోనే లోక్‌సభ రద్దయిన పక్షంలో ఆ బిల్లు కూడా జీవత్వాన్ని కోల్పోతుంది. ఇక్కడ ట్రిపుల్ తలాక్ విషయంలోనూ అదే జరిగింది. ఒకవేళ ఏదైనా బిల్లును తొలుత రాజ్యసభలో ప్రతిపాదించి ఆమోదించి, లోక్‌సభకు పంపించిన తర్వాత లోక్‌సభ రద్దయితే ఆ బిల్లు యధావిధిగా ఉంటుంది. కాబట్టి ట్రిబుల్ తలాక్ బిల్లు విషయంలో కేంద్ర మంత్రివర్గం మళ్లీ ఆమోదం తెలిపి, బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టే విషయాన్ని పరిశీలిస్తుందన్న ఊహగానాలు వినిపిస్తున్నాయి. సునాయసంగా తలాక్ (విడాకులు) ఇవ్వడం నుంచి ముస్లిం మహిళలను కాపాడేందుకు లోగడ బీజేపీ ప్రభుత్వం ఆర్డినెన్స్ తెచ్చిన సంగతి తెలిసిందే.