జాతీయ వార్తలు

ఓటర్లకు కృతజ్ఞతలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాయ్‌బరేలీ, జూన్ 12: ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపేందుకు యూపీఏ చైర్‌పర్సన్ సోనియా గాంధీ, ఆమె కుమార్తె, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపేందుకు బుధవారం ఇక్కడకు చేరుకున్నారు. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో రాయ్‌బరేలీ నుంచి సోనియా గాంధీ మరోసారి ఎన్నికైన విషయం తెలిసిందే. ఫుర్సత్‌గంజ్ విమానాశ్రయంలో దిగిన సోనియా, ప్రియాంక అక్కడ నుంచి నేరుగా భుయేమా గెస్ట్‌హౌస్‌కు చేరుకున్నారు. ఉత్తరప్రదేశ్ తూర్పు ప్రాంతానికి కాంగ్రెస్ ఇన్‌చార్జిగా ప్రియాంక సేవలు అందించారు. కాగా, సోనియాతో కలసి ప్రియాంక గెస్ట్‌హౌస్‌లో వివిధ జిల్లాలకు చెందిన పార్టీ ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. సాయంత్రం జరిగిన థాంక్స్ గివింగ్ కార్యక్రమానికి సుమారు 2,500 మంది పార్టీ కార్యకర్తలు హాజరయ్యారు. ఇలావుంటే, వీరిద్దరూ పక్కనే ఉన్న అమేథీ నియోజకవర్గంలో పర్యటించే అవకాశాలు లేవని పార్టీ వర్గాలు తెలిపాయి. అమేథీ నుంచి పోటీ చేసిన కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ 55,120 ఓట్ల తేడాతో కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ చేతిలో పరాజయాన్ని చవిచూశారు. 2014లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఆమెపై 1.07 లక్షల ఓట్ల మెజారిటీతో గెలిచిన రాహుల్ ఈసారి అనూహ్యంగా ఆమె చేతిలోనే పరాజయాన్ని చవిచూశారు. అయితే, రాయ్‌బరేలీలో సోనియా 1.67,178 ఓట్ల తేడాతో బీజేపీ అభ్యర్థి దినేష్ ప్రతాప్ సింగ్‌ను ఓడించారు. తనను గెలిపించిన ఓటర్లకు కృతజ్ఞతలు తెలుపుకోవడానికి ఆమె ప్రియాంకతో సహా రాయ్‌బరేలీకి వచ్చారు. తన విజయానికి కృషి చేసిన ప్రతిఒక్కరికీ ఆమె కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా తనను మరోసారి గెలిపించిన ఓటర్లకు కూడా సోనియా కృతజ్ఞతలు తెలిపారు. స్థానిక సమస్యల పరిష్కారానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని ఆమె ప్రకటించారు. ఎన్నికలకు ముందు అమేథీ ప్రజల కోసం ఎలాంటి త్యాగానికైనా సిద్ధంగా ఉన్నానని తాను చేసిన హామీకి కట్టుబడి ఉంటానని ఆమె చెప్పారు. కాంగ్రెస్‌కు చెందిన ఎంతోమంది నేతలు చూపిన మార్గాన్ని అనుసరిస్తానని, రాజకీయాల్లో విలువలను కాపాడతానని సోనియా అన్నారు. ప్రజలు తనపై చూపిన నమ్మకాన్ని వమ్ము చేయబోనని ఆమె స్పష్టం చేశారు. రాయ్‌బరేలీ అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని ఆమె చెప్పారు.