జాతీయ వార్తలు

మామా.. కుశలమా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు, జూన్ 12: భారత్ రూపొందించిన రెండో ‘మిషన్’ చంద్రయాన్-2 చందమామను అందుకునేందుకు సంసిద్ధమైంది. జూలై 15న ఈ ప్రతిష్టాత్మక ఉపగ్రహ ప్రయోగం జరుగుతుందని భారత అంతరిక్ష పరిశోధనా కేంద్రం (ఇస్రో) చైర్మన్ కే. శివన్ బుధవారం నాడిక్కడ వెల్లడించారు. చంద్ర గ్రహంలోని సౌత్‌పోల్‌పైకి దిగి పరిశోధనలు చేయడం ఇప్పటి వరకు జరుగలేదని, ఈ క్లిష్టతర సవాలును సుసాధ్యం చేసేందుకు భారత అంతరిక్ష సంస్థ అన్ని ఏర్పాట్లూ చేసిందని అయన చెప్పారు. వచ్చే సెప్టెంబర్ 6 లేదా 7వ తేదీల్లో చంద్రుడిపైకి చంద్రయాన్ చేరుకుంటుందన్నారు. అంధ్రప్రదేశ్ రాష్ట్రం నెలూరు జిల్లా శ్రీహరి కోట స్పేస్‌పోర్టు నుంచి జిఎస్‌ఎల్‌వీ ఎంకే-3 వాహక నౌకలో చంద్రయాన్‌ను సమ్మిళితం చేసి జూలై 15న తెల్లవారుఝామున 2.51 గంటల అంతరిక్షంలోకి ప్రయోగించడం జరుగుతుందని శివన్ వెల్లడించారు. ఈ ప్రయోగాన్ని జూలై 9, 16 మధ్య నిర్వహించేందుకు వీలుగా గతంలోనే లాంచ్ విండోను ఇస్రో సిద్ధం చేసింది. ఈ అంతరిక్ష నౌక మొత్తం 3.8 టన్నుల బరువుంటుందని, మొత్తం మూడు మోడ్యూల్స్, ఒక ఆర్బిటర్, ల్యాండర్ (విక్రం), మరో రోవర్ (ప్రజ్ఞాన్) దానితో అనుసంధానమై ఉంటాయని ఇస్రో చైర్మన్ వివరించారు. కాగా చంద్రయాన్-2 మిషన్ మొత్తం విలువ రూ.603 కోట్లు అని అయన వెల్లడించారు. ఇందులో జీఎస్‌ఎల్‌వీ ఎంకే-3 విలువ మాత్రమే రూ. 375 కోట్లు అని తెలిపారు. కాగా ఇస్రో సమాచారం మేరకు సైంటిఫిక్ పేలోడ్స్‌తో ఉండే ఆర్బిటర్ చంద్రయాన్-2 ఉపగ్రహాన్ని చంద్రుని చుట్టూ కక్షలో తిరిగేందుకు దోహదం చేస్తుందని తెలుస్తోంది. అలాగే చంద్రుడిపై అనుకున్న చోట సురక్షితంగా దిగేందుకు, రోవర్‌ను దింపేందుకు ‘ల్యాండర్’ తోడ్పతుంది. కాగా ఆర్బిటర్‌లో ఆన్‌బోర్డుపై ఉండే సైంటిఫిక్ పేలోడ్స్‌తోబాటు, ల్యాండర్, రోవర్‌లు చంద్రునిపై ఉండే ఖనిజాల పరమైరమైన, వస్తుపరమైన పరిశోధనలు సాగిస్తాయి. మెకానికల్‌గా ఆర్బిటర్, ల్యాండర్‌లు సమ్మిళితమై ఉంటాయి. వీటిని మరో సమగ్రమైన మోడ్యూల్‌తో అనుసంధానించి జీఎస్‌ఎల్‌వీ ఎంకే-3 వాహక నౌక (లాంచ్ వెయికల్)లో ఏర్పాటు చేస్తారు. ల్యాండర్ లోపల రోవర్ అనుసంధానమై ఉంటుంది. భూమి నుంచి అంతరిక్షంలోని కక్ష్యలోకి జీఎస్‌ఎల్‌వీ ఎంకే-3ని ప్రయోగించిన తర్వాత అందులో నుంచి మోడ్యూల్ విడిపోయి ఆర్బిట్ ప్రపొల్షన్ మోడ్యూల్‌ను వినియోగించుకుని చంద్రుడి చుట్టూ ఉన్న కక్ష్యలోకి వెళుతుంది. ఆ తర్వాత చంద్ర గ్రహంపైనున్న నిర్ధేశిత లూనార్ సౌత్‌పోల్ వద్ద చదునైన స్థలంలో ఆర్బిటర్ నుంచి ల్యాండర్ విడిపోతుందని చంద్రయాన్-2 ప్రయోగ పరిణామ క్రమాన్ని ఇస్రో వివరించింది. కాగా చంద్రగ్రహంపై ‘రోలర్’ రోలవుట్ అవుతూ పలు వైజ్ఞానిక పరమైన పరిశోధనలు, ప్రయోగాలు నిర్వహిస్తుంది. కాగా వివిధ పరిశోధనలకు, ప్రయోగాలకు అనుగుణంగా ల్యాండ్‌ర్‌లోనూ, ఇటు ఆర్బిటర్‌లో సైతం సమగ్ర ఏర్పాట్లు చేసినట్టు ఇస్రో వెల్లడించింది. పదేళ్ల క్రితం ప్రయోగించిన చంద్రయాన్-1 కంటే అత్యంత ఆధునికతను చంద్రయాన్-2లో పొందుపరిచామని తెలిపింది. చంద్రయాన్-1లో మొత్తం 11 పేలోడ్స్ వినియోగించగా అందులో 5 మనదేశం స్వయంగా రూపొందించింది. మిగిలిన వాటిలో మూడు ఐరోపా దేశాల్లో, మరో రెండు అమెరికా, బల్గేరియాల్లో తయారైనవి. అప్పట్లో చంద్రుడిపై నీటి జాడను కనుగొన్న వైశిష్ట్యం చంద్రయాన్-1 సొంతం చేసుకుంది. 1.4 టన్నుల బరువుకలిగిన ఆ ఉపగ్రహాన్ని పీఎస్‌ఎల్‌వీ వాహక నౌక ద్వారా ప్రయోగించి చంద్రుడికి 100 కిలోమీటర్ల దూరంలోని కక్ష్యలోకి ప్రవేశపెట్టడం జరిగింది.

చిత్రాలు.. శ్రీహరికోటలో ‘చంద్రయాన్-2’ ప్రయోగానికి
జరుగుతున్న ఏర్పాట్లు (ఇన్‌సెట్‌లో) ఇస్రో చైర్మన్ శివన్