అంతర్జాతీయం

చైనాతో బంధం మరింత బలోపేతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిష్కేక్, జూన్ 13: షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీఓ) శిఖరాగ్ర సమావేశం జరుగుతున్న సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ గురువారం ఇక్కడ విడిగా చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌తో భేటీ అయ్యారు. భారత్, చైనాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి గల మార్గాలపై ఈ ఇద్దరు నేతలు చర్చించారు. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించి, నరేంద్ర మోదీ గత నెలలో రెండోసారి ప్రధాన మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత ఈ ఇద్దరు నేతలు భేటీ కావడం ఇదే మొదటిసారి. 3చైనాతో స్నేహం మరింత బలపడుతోంది. ఎస్‌సీఓ శిఖరాగ్ర సమావేశం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌తో విడిగా భేటీ అయ్యారు. ఈ ఇద్దరు నేతలు ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవడానికి ఉన్న మార్గాలపై చర్చిస్తున్నారు2 అని ప్రధానమంత్రి కార్యాలయం సామాజిక మాధ్యమం ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన ఒక సందేశంలో పేర్కొంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న రక్షణాత్మక వాణిజ్య విధానాలకు, సుంకాలను ఆయుధంగా వాడుకుంటున్న ఏకపక్ష విధానాలకు వ్యతిరేకంగా యునైటెడ్ ఫ్రంట్‌ను ఏర్పాటు చేయవలసిన అవసరాన్ని అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ నొక్కి చెబుతారని సమావేశానికి ముందు చైనా సంకేతాలు ఇచ్చింది. చైనా, అమెరికా మధ్య గత సంవత్సర కాలంగా వాణిజ్యానికి సంబంధించిన వైరుధ్యం తీవ్రమవుతోంది. చైనాకు చెందిన టెలికం దిగ్గజం హువేయిపై అమెరికా వాణిజ్య ఆంక్షలను కఠినతరం చేయడంతో ఇటీవలి నెలల్లో ఇరు దేశాల మధ్య వాణిజ్య యుద్ధం పరిధి మరింత విస్తరించింది.
అమెరికాతో వాణిజ్య పరమయిన ఘర్షణను ఎదుర్కొంటున్న భారత్ కూడా ట్రంప్ రక్షణాత్మక వాణిజ్య విధానాలకు వ్యతిరేకంగా తమతో చేయి కలుపుతుందని చైనా అధికారులు ఆశిస్తున్నారు. అమెరికా ఇటీవల జనరలైజ్డ్ సిస్టమ్ ఆఫ్ ప్రిఫరెనె్సస్ (జీఎస్‌పీ) కింద భారత్‌కు ఉన్న 3అభివృద్ధి చెందుతున్న దేశం లబ్ధిదారు2 హోదాను తొలగించింది. ప్రధాని మోదీ ఎస్‌సీఓ సమ్మిట్‌లో పాల్గొనేందుకు గురువారం కిర్గిజ్‌స్తాన్ రాజధాని బిష్కేక్‌కు చేరుకున్నారు.

గురువారం కజకిస్థాన్ రాజధాని భిష్‌కెక్‌లో షాంఘై సహకార మండలి శిఖరాగ్ర సమావేశంలో
భారత ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ కరచాలనం