జాతీయ వార్తలు

యార్లగడ్డకు కృష్ణదేవరాయ పురస్కారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 3: కేంద్రీయ హిందీ భాషా సమితి సభ్యుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌కు 2016 సంవత్సరానికిగాను శ్రీకృష్ణదేవరాయ పురస్కారం లభించింది. అరవై ఏళ్లుగా తెలుగు భాష, సంస్కృతి, విద్యా రంగాల అభివృద్ధికి కర్నాటకలో కృషిచేస్తున్న తెలుగు విజ్ఞాన సమితి ఈ అవార్డును ప్రకటించింది. సాహిత్య రంగంలో విశేష సేవలు అందించినందుకుగాను యార్లగడ్డకు ఈ అవార్డును అందజేస్తున్నట్లు సమితి అధ్యక్షుడు ఏ.రాధాకృష్ణరాజు తెలిపారు. గతంలో ఈ అవార్డును ఎన్టీఆర్, అక్కినేని, సినారే, ఎస్పీ.బాలసుబ్రమణ్యం, సుశీల, జేసుదాస్, సరోజాదేవి, యు.ఆర్.అనంతమూర్తికి ఇచ్చినట్లు వివరించారు. సెప్టెంబర్ 10న కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య చేతుల మీదుగా ఈ అవార్డును అందజేస్తారు.