జాతీయ వార్తలు

అన్యాయం.. అసమానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: మెజారిటీ ప్రజల అభీష్టానికి భిన్నంగా ఏపీ విభజన జరిగిందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆరోపించారు. నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్ర విభజన అన్యాయంగా, అసమానంగా జరిగిందన్నారు. విభజన మూలంగా ఆంధ్రప్రదేశ్‌కు ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి, ఉపాధి కల్పనలో అసమానతలు నెలకొంటాయనే వాస్తవాన్ని పూర్తిగా విస్మరించారని ఆరోపించారు. విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్‌కు 59 శాతం జనాభా, అప్పులు లభిస్తే ఆదాయం మాత్రం 47 శాతం మాత్రమే ఇచ్చారని ఆరోపించారు. విభజన అనంతరం ఏపీకి 2015-20 మధ్య రూ.22,113 కోట్ల లోటు ఉంటుంది.. ఇదే కాలానికి తెలంగాణకు రూ.1,18,678 కోట్ల మిగులు ఉంటుందని పధ్నాల్గవ ఆర్థిక సంఘం అంచనా వేసింది.. అయితే ఏపీ వాస్తవ లోటు రూ.66,362 కోట్లని ముఖ్యమంత్రి తెలిపారు. హైదరాబాద్ నగరం కొన్ని దశాబ్దాల కాలంలో ఒక సూపర్ ఆర్థిక శక్తిగా ఎదిగిందనేది అందరికీ తెలుసు.. మొత్తం ఏపీ నుండి రూ.57,000 కోట్ల సాఫ్ట్‌వేర్ ఎగుమతులయితే అందులో హైదరాబాదు నుండి రూ.56,500 కోట్లు అని జగన్ వివరించారు. 2015-16 సంవత్సరానికి తెలంగాణ తలసరి ఆదాయం రూ.14,411 అయితే.. ఏపీ తలసరి ఆదాయం రూ.8,397 అని చెప్పారు. విభజన అనంతరం ఏపీ దుస్థితిలో పడిపోతుందనే ముందాలోచనతో ఐదు సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇవ్వాలనే షరతు విధించారని జగన్‌మోహన్ రెడ్డి తెలిపారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకపోవటం వలన అనేక సమస్యలు వచ్చాయని అన్నారు. విభజన జరిగినప్పుడు ఏపీకి ఉన్న అప్పులు రూ.97వేల కోట్లు కాగా ఇప్పుడది రూ.2,58,928 కోట్లకు చేరిందని ముఖ్యమంత్రి వెల్లడించారు. అప్పులపై వడ్డీ దాదాపు సాలీనా రూ.20,000 కోట్లు.. దీనికితోడు సాలీనా రూ.20,000 కోట్ల రుణ చెల్లింపులు ఉన్నాయని ఆయన వాపోయారు. ప్రత్యేక హోదా కల్పించటం వలన రాష్ట్రానికి ఎక్కువ నిధులు వస్తాయని అన్నారు. రాష్ట్రానికి రూ.5,573 కోట్లు రావలసి ఉండగా కేవలం రూ.3,428 కోట్లు మాత్రమే వచ్చాయన్నారు. అనాలోచిత విభజన మూలంగా ఏపీకి తీరని నష్టం జరిగిందని దుయ్యబట్టారు.