జాతీయ వార్తలు

‘సహకారాన్ని పెంపొందించుకోవాలి’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 15: భారత్, బంగ్లాదేశ్ సరిహద్దుల్లో హత్యోదంతాలను తగ్గించాలని ఇరు దేశాల సరిహద్దు భద్రతా బలగాలు శనివారం నిర్ణయించాయి. పరిస్థితి భయానకంగా మారి, తమ బలగాల ప్రాణాలకు ప్రమాదం ఏర్పడిన సమయాలలో మాత్రమే తాము కాల్పులకు దిగుతున్నట్టు భారత భద్రతా బలగం (బీఎస్‌ఎఫ్) తెలిపింది. బీఎస్‌ఎఫ్, బోర్డర్ గార్డ్స్ బంగ్లాదేశ్ (బీజీబీ)ల మధ్య 48వ ద్వైవార్షిక డైరెక్టర్ జనరల్ స్థాయి చర్చలు శనివారం ఢాకాలో ముగిశాయి. ఇరు దేశాల మధ్య 4,096 కిలో మీటర్ల మేరకు గల సరిహద్దుల్లో నేరాలను, పశువులు, మాదకద్రవ్యాల స్మగ్లింగ్‌ను మెరుగయిన రీతిలో నిరోధించడానికి సహకారాన్ని పెంపొందించుకోవాలని ఇరు దేశాలు ఈ చర్చల్లో నిర్ణయించాయని బీఎస్‌ఎఫ్ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. సరిహద్దుల్లో బంగ్లాదేశ్‌కు చెందిన నేరస్థులు చేసిన దాడుల్లో ఒక భారత సైనికుడు మృతి చెందాడని, మరో 39 మంది సైనికులు తీవ్రంగా గాయపడ్డారని ఈ చర్చల సందర్భంగా బీఎస్‌ఎఫ్ చీఫ్ రజనీకాంత్ మిశ్రా బీజీబీకి తెలిపారు.