జాతీయ వార్తలు

జూలై 15న చంద్రయాన్- 2 ప్రయోగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూళ్లూరుపేట: యావత్ దేశవ్యాప్తంగా ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న రోజులు దగ్గరకు వచ్చాయి. మరి కొద్ది రోజుల్లోనే భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చంద్రయాన్ - 2 ఉపగ్రహ ప్రయోగం చేపట్టేందుకు సాహసం చేసింది. జిఎస్‌ఎల్‌వి మార్క్ -3 రాకెట్ ద్వారా చంద్రయాన్ - 2 ప్రయోగాన్ని నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం సతీష్‌థావన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి జూలై 15న తెల్లవారుజామున ప్రయోగించనున్నారు. షార్ నుంచి ప్రయోగించే ఈ ఉపగ్రహం బెంగళూరులోని ఉపగ్రహ తయారీ కేంద్రం నుంచి భారీ భద్రత నడుమ ప్రత్యేక వాహనంలో రోడ్డు మార్గాన షార్‌కు చేరింది. ఈ ఉపగ్రహాన్ని షార్‌లోని ఉపగ్రహ పరీక్షల భవనంలో భద్రపరిచారు. పరీక్షల అనంతరం రాకెట్ అనుసంధానంలో భాగంగా 2వ ప్రయోగ వేదిక వద్ద చేర్చనున్నారు. రాకెట్ చివరి భాగంలో ఉపగ్రహాన్ని అమర్చి ప్రయోగానికి సిద్ధం చేస్తారు. ఉపగ్రహం అమర్చే సమయంలో శాస్తవ్రేత్తలు తుది పరీక్షలు నిర్వహించి ఉపగ్రహ పనితీరును పర్యవేక్షిస్తారు. అయితే ఈ ప్రయోగం ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకోనుంది. చంద్రయాన్ - 2 ప్రయోగం సర్వత్రా ఉత్కంఠ నెలకొన్న నేపధ్యంలో ప్రయోగాన్ని వీక్షించేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ షార్‌కు రానున్నారు. మొత్తం మీద సామాన్యుడి చెంతకు సాంకేతిక మేదస్సును చేర్చాలన్న ఉద్దేశంతో ఇస్రో చంద్రయాన్ - 2 ప్రయోగాన్ని చేటప్టనుంది. జూలై 15న నిర్దేశించిన సమయానికి ప్రయోగాన్ని చేపట్టేలా ఇస్రో కసరత్తు చేస్తుంది.
చిత్రం...షార్‌కు వెళుతున్న చంద్రయాన్ -2 ఉపగ్రహం