జాతీయ వార్తలు

కొనసాగుతున్న ‘ఆపరేషన్ సన్‌రైజ్’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 16: భారత్-మయన్మార్ సహకార ఒప్పందాల్లో భాగంగా ‘ఆపరేషన్ సన్‌రైజ్’ కొనసాగుతోంది. ఇందులో భాగంగానే ఇరు దేశాల ఆర్మీలు ఆయా సరిహద్దుల్లోని ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేస్తున్నాయి. మణిపూర్, నాగాలాండ్, అస్సాంలోని పలు ఉగ్రవాద స్థావరాలను మట్టుబెట్టినట్లు రక్షణ శాఖ వర్గాలు ఆదివారం వెల్లడించాయి. మూడు నెలల క్రితం ప్రారంభమైన ‘ఆపరేషన్ సన్‌రైజ్’లో భారత్-మయన్మార్ సరిహద్దుల్లోని ఈశాన్య ప్రాంతాలకు చెందిన ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేశారు. ఈశాన్య రాష్ట్రాల సరిహద్దు మొత్తం 1640 కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. నాగాలాండ్, మణిపూర్‌లలోని ఉగ్రవాద ప్రాంతాలు ఇందులో భాగంగానే ఉన్నాయి. ఇరు దేశాల ఆర్మీలు మరింత సమన్వయంగా పనిచేయాలని భారత్ కోరుతోంది. ముఖ్యంగా ఆపరేషన్ సన్‌రైజ్-2లో మిలిటెంట్ స్థావరాలనే లక్ష్యంగా ఈ ఆర్మీ వర్గాలు పనిచేస్తున్నాయి. ఇందులో కంతాపూర్ లిబరేన్ ఆర్గనైజేషన్ (కేఎల్‌వో), ఎన్‌ఎస్‌సీఎన్ (ఖల్పాంగ్), డదక య్నైటెడ్ ఫ్రంట్ ఆఫ్ అస్సాం (ఐ)తో పాటు నేషనల్ డెమొక్రటిక్ ఫ్రంట్ ఆఫ్ బోరోలాండ్ (ఎన్‌డీఎఫ్‌బీ) ఉగ్రవాద సంస్థలున్నాయి. ఆయా సంస్థలకు చెందిన దాదాపు వంద మంది ఉగ్రవాదులను ఇరు దేశాల ఆర్మీలు పట్టుకొని వారి వారి స్థావరాలను మట్టుబెట్టాయి. ఇంటలిజెన్స్ నివేదికలు ఆధారంగా మూడో విడత ఆపరేషన్ సైతం చేపట్టాలని ఇరు దేశాలూ భావిస్తున్నాయి. ఇందులో ఇండియన్ ఆర్మీతో పాటు అస్సాం రైఫిల్స్ కూడా పాల్గొంటాయి. 2015 సంవత్సరంలో భారత్-మయన్మార్ సరిహద్దులో మణిపూర్‌కు చెందిన 18మంది భద్రతా దళాలను ఎన్‌ఎస్‌సీఎన్ (కే) ఉగ్రవాదులు హతమార్చారు. మొత్తమీద ఇరు దేశాల్లో ఉగ్రవాద భూతాన్ని తరిమికొట్టాలన్న లక్ష్యంతో ఇరు దేశాలూ పరస్పర సహకారంతో ఆర్మీ ఆపరేషన్‌ను మొదలు పెట్టాయని చెప్పొచ్చు.