జాతీయ వార్తలు

రైల్వేల పబ్లిసిటీకి ప్రైవేటు పీఆర్వోలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 16: రైల్వే శాఖ అద్దెకు ప్రైవేటుగా పౌరసంబంధాల అధికారులను నియమించాలనుకుంటున్నది. రైల్వేల ప్రచార కార్యక్రమాలకు వీలుగా దేశ వ్యాప్తంగా అన్ని జోన్లలో పౌరసంబంధాల అధికారులను నియమించేందుకు వీలుగా ఉత్తర్వులు వెలువరించింది. ప్రస్తుతం 18 జోన్లలో 79 మంది అధికారులు, ఒక ప్రధాన పౌర సంబంధాల అధికారులు పని చేస్తున్నారు. రైల్వేకు సంబంధించిన సమాచారాన్ని మీడియాకు చేరవేయడానికి పలువురు పీఆర్వోలు, పౌరసంబంధాల ఇన్‌స్పెక్టర్లు ఉన్నారు. 17 జోన్లకు పీఆర్ ప్రొఫెషనల్స్ ఉన్నారని వీరంతా అద్దెకు తీసుకున్నట్లు తెలిపారు. ప్రచార కార్యక్రమాలకు ప్రైవేటు ఏజెన్సీల సర్వీసులను రైల్వేలో వివిధ విభాగాల్లో వినియోగించుకుంటున్నామని రైల్వే బోర్డు సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. నియమ, నిబంధనల ప్రకారం ఒక్కో జోన్‌లో శిక్షణ పొందిన నిపుణున్ని, సోషల్ మీడియా మేనేజర్‌ను, విశే్లషకున్ని, వీడియో ఎడిటర్స్‌ను ఇతరులను నియమించినట్లు తెలిపారు. ఈ ఒక్కోక్క బృందానికి రెండు కోట్ల రూపాయల వ్యయం అవుతుందని వివరించారు.