జాతీయ వార్తలు

రాహుల్ నాయకత్వమే శరణ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 16: లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం చెందిన నేపథ్యంలో పార్టీకి ‘పెద్దాపరేషన్’ చేయడం తప్పనిసరి అని సీనియర్ కాంగ్రెస్ నాయకుడు వీరప్ప మొయిలీ అనిప్రాయపడ్డారు. రాహుల్ గాంధీ ఒక డైనమిక్ నాయకుడు.. ఎన్నికల్లో ఓటమికి కేవలం ఆయన్ను మాత్రమే చేయడం ఎంతమాత్రం తగదు.. ఆయా రాష్ట్రాల్లోని పార్టీ అధ్యక్షుల పనితీరు కూడా కారణమనీ.. పార్టీని గ్రామ స్థాయి నుంచి పూర్తిగా ప్రక్షాళన చేయాల్సిన అవసరం చాలా ఉందని మొయిలీ ఆదివారం ఇక్కడ విలేఖరుల సమావేశంలో చెప్పారు. పార్టీలో పునరుత్తేజం నింపాలంటే యువరక్తం రావాల్సిన అవసరం ఉందని మొయిలీ స్పష్టం చేశారు. దేశ వ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ పరాభవానికి నైతిక బాధ్యత వహిస్తూ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తన పదవికి రాజీనామా చేయాలనుకోవడం నిజంగా వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తోందని.. ఇది ప్రశంసనీయమని మొయిలీ పేర్కొన్నారు.
అయితే, ఇటీవలి సీడబ్ల్యూసీ సమావేశంలో రాజీవ్ గాంధీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని.. ఆయనే పార్టీ సరైన అధ్యక్షుడుగా సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించిందని మొయిలీ అన్నారు. పార్టీకి రాహుల్ గాంధీయే సరైన అధ్యక్షుడు అని నొక్కి చెప్పారు. కేవలం 2017 నుంచి మాత్రమే పార్టీ అధ్యక్షుడి బాధ్యతలు చేపట్టిన రాహుల్ ఆ బాధ్యత నుంచి తప్పుకోవాలని భావించడం సరికాదని సమావేశం నిర్ద్వంద్వంగా చెప్పిందని మొయిలీ అన్నారు. ‘ఓటమికి బాధ్యత వహించాల్సింది రాహుల్ కాదు.. ఆయా రాష్ట్రాల పార్టీ అధ్యక్షులు మాత్రమే’నని అభిప్రాయం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌కు పూర్వ వైభవం రావాలంటే గ్రామస్థాయి నుంచి జరిగే ప్రతి ఎన్నికనూ ప్రతిష్టాత్మకంగా తీసుకొని పనిచేయాలని పార్టీ కార్యకర్తలు, నాయకులకు విజ్ఞప్తి చేశారు. జార్ఖండ్, మహారాష్ట్ర, హర్యానాల్లో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాహుల్ గాంధీ పార్టీ ప్రక్షాళనకు వెంటనే నడుం బిగించాల్సిన అవసరం ఉందని మొయిలీ పేర్కొన్నారు. ‘పార్టీకి కొత్త అధ్యక్షుడు ఎవరు అన్న చర్చ ప్రస్తుతం అనవసరం అనీ.. కాంగ్రెస్ పటిష్టతకు రాహుల్ వెంటనే రంగంలోకి దిగి సమయం వృథా కాకుండా అవసరాన్ని బట్టి ఆయా రాష్ట్రాలకు కొత్త అధ్యక్షులను నియమించేందుకు కసరత్తును ప్రారంభించాలి’ అని స్పష్టం చేశారు.