జాతీయ వార్తలు

బహిరంగ చర్చలు జరగాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా: తమపై జరిగిన దాడులకు నిరసనగా గత ఆరు రోజులుగా విధులను బహిష్కరించి ఆందోళన చేస్తున్న జూనియర్ వైద్యులు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బహిరంగంగా ఏ వేదికపైనైనా చర్చలు నిర్వహించేందుకు ముందుకు వస్తే తాము అందుకు సిద్ధమేనని స్పష్టం చేశారు. వైద్యుల సమ్మెతో గత కొద్దిరోజులుగా రాష్ట్రంలో నెలకొన్న గందరగోళ పరిస్థితుల నేపథ్యంలో శనివారంనాడు ముఖ్యమంత్రి మాట్లాడుతూ చర్చలకు ఆహ్వానించారు. కానీ వైద్యులు అందుకు నిరాకరించారు.
ఆదివారంనాడు జూనియర్ డాక్టర్ల జాయింట్ ఫోరం తరఫున అధికార ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ ‘ఈ సమస్యకు ముగింపు పలికేందుకు మేము రెడీనే. ముఖ్యమంత్రి ఎక్కడ బహిరంగ చర్చకు పిలిచినా మీడియా ప్రతినిధుల సమక్షంలో హాజరయ్యేందుకు మేము సిద్ధమే. అంతేకాని అంతర్గత చర్చలకు మేము సిద్ధంగా లేము’ అని స్పష్టం చేశారు. మీడియా ప్రతినిధుల సమక్షంలో బహిరంగ చర్చ ఎక్కడ నిర్వహించినా మెడికల్ కాలేజీలు, ఆసుపత్రుల తరఫున ప్రతినిధులు హాజరయ్యేందుకు సిద్ధంగా ఉన్నారని ఆ ప్రతినిధి స్పష్టం చేశారు. ‘మా సమస్య ఎంత త్వరగా పరిష్కారమైతే అంత త్వరగా విధుల్లో చేరేందుకు మేము సిద్ధంగా ఉన్నాము. సామాన్య ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ముఖ్యమంత్రి మా సమస్యలకు బహిరంగంగా తగిన పరిష్కారం చూపిస్తారనే విశ్వసిస్తున్నాం’ అని ఆ ప్రతినిధి పేర్కొన్నారు.