జాతీయ వార్తలు

నేడు దేశవ్యాప్త సమ్మె

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: పశ్చిమబెంగాల్‌లో వైద్యులపై దాడులకు నిరసనగా సోమవారంనాడు దేశవ్యాప్తంగా సమ్మె చేయాలని నిర్ణయించినట్టు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) ఆదివారంనాడు తెలిపింది. అత్యవసర సర్వీసులు కాని వైద్య సేవలు మాత్రం కొనసాగుతాయని ఐఎంఏ స్పష్టం చేసింది. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ వైద్యులకు, వైద్యనిపుణులపై దాడులు జరుగకుండా రక్షణ కల్పించేందుకు ఒక చట్టాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉందని ప్రకటించిన మరుచటిరోజే ఐఎంఏ దేశవ్యాప్త సమ్మెకు పిలుపునివ్వడం గమనార్హం. వైద్యులు, వైద్యసిబ్బంది, ఆసుపత్రుల్లో దాడులు జరుగకుండా కేంద్ర స్థాయిలో ఒక చట్టాన్ని తీసుకురావాలని ఐఎంఏ డిమాండ్ చేసింది. అంతేకాకుండా ఆసుపత్రుల్లో ఎలాంటి హింసాత్మక సంఘటనలు చోటుచేసుకోకుండా గట్టి బందోబస్తు ఏర్పాట్లు చేయాలని కోరింది. వైద్యులు, వైద్య సిబ్బందిపై దాడులు, ఆసుపత్రులను విధ్వంసం చేయడం వంటి చర్యలకు పాల్పడేవారిని కఠినంగా శిక్షించేందుకు, తద్వారా వైద్యుల్లో భద్రతాపరంగా తగిన భరోసా కల్పించేందుకు వీలుగా భారత శిక్షాస్మృతిలో (ఐపీసీ)లో చట్టాన్ని సవరించాలని ఐఎంఏ డిమాండ్ చేసింది.