జాతీయ వార్తలు

ఢిల్లీ అసెంబ్లీపై బీజేపీ దృష్టి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 16: ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన భారతీయ జనతా పార్టీ వచ్చే సంవత్సరం తొలినాళ్లలో జరుగనున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలపై దృష్టి సారించింది. ఎన్నికల ప్రచారానికి సంబంధించి రాజకీయ అంశాలు, అభ్యర్థుల ఎంపికను మెరుగయిన రీతిలో నిర్వహించడానికి పలు సర్వేలు నిర్వహించేందుకు బీజేపీ కసరత్తు చేస్తోంది. బీజేపీ సీనియర్ నాయకుడు ఒకరు ఆదివారం ఈ విషయం వెల్లడించారు. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో దేశ రాజధాని ఢిల్లీలో బీజేపీ 55 శాతం ఓట్లు సాధించింది. వచ్చే సంవత్సరం జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఈ 55 శాతం ఓట్ల వాటాను నిలబెట్టుకోవడానికి బీజేపీ అన్ని రకాలుగా కృషి చేస్తోంది. ఎందుకంటే, అసెంబ్లీ ఎన్నికల్లో 55 శాతం ఓట్లు సాధిస్తే, పూర్తి ఆధిక్యత సాధించవచ్చని బీజేపీ భావిస్తున్నట్టు ఆ పార్టీ సీనియర్ నాయకుడు తెలిపారు. ఇటీవల బీజేపీ ఢిల్లీ నాయకుల సమావేశంలో పార్టీ ప్రధాన కార్యదర్శి (సంస్థాగత వ్యవహారాలు) సిద్ధార్థన్ మాట్లాడుతూ ఢిల్లీలో 55 శాతం ఓట్ల వాటాను నిలబెట్టుకోవడానికి కృషి చేయాలని సూచించినట్టు ఆ నాయకుడు వెల్లడించారు. మహారాష్ట్ర, హర్యానా, జార్ఖండ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఈ సంవత్సరం అక్టోబర్- నవంబర్ నెలల్లో జరుగనున్న దృష్ట్యా, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలను కూడా ముందుకు జరిపి ఈ మూడింటితో కలిపి నిర్వహించనున్నారని ఊహాగానాలు వచ్చిన నేపథ్యంలో బీజేపీ రెగ్యులర్ మీటింగ్‌లు జరుగుతున్నాయని ఆయన చెప్పారు. ‘రానున్న అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని నియోజకవర్గం వారీగా నిర్దిష్ట సమస్యలు, ఢిల్లీలో ఆప్ ప్రభుత్వం, దాని ఎమ్మెల్యేల పనితీరుపై అంచనా వేయడంతో పాటు అభ్యర్థుల ఎంపిక కోసం ప్రజల్లో బీజేపీ నాయకులకు ఉన్న ప్రజాదరణను అంచనా వేయడం కోసం మూడు రకాల సర్వేలు నిర్వహించడానికి కసరత్తు చేస్తున్నాం’ అని ఉన్నత స్థాయి ఢిల్లీ బీజేపీ నాయకుడు ఒకరు తెలిపారు. అరవింద్ కేజ్రీవాల్ నాయకత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) 2015లో జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని చిత్తుగా ఓడించి మొత్తం 70 స్థానాలకు గాను 67 స్థానాలను కైవసం చేసుకుంది. 2014 లోక్‌సభ ఎన్నికల్లో ఢిల్లీలో మంచి పనితీరును కనబరచిన బీజేపీ ఏడాదిలోపే జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం కేవలం మూడు నియోజకవర్గాల్లోనే విజ యం సాధించగలిగింది.