జాతీయ వార్తలు

కలిసికట్టుగా పని చేద్దాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: రాజకీయ విబేధాలను పక్కన పెట్టి పార్లమెంటు సమావేశాలు సజావుగా సాగేలా సహకరించాలని ప్రతిపక్ష పార్టీలకు ప్రధాని నరేంద్ర మోదీ విజ్ఞప్తి చేశారు. సోమవారం నుంచి పార్లమెంటు సమావేశాలు ప్రారంభంకానున్న దృష్ట్యా ఆదివారం జరిగిన అఖిలపక్ష సమావేశంలో మోదీ మాట్లాడారు. ‘మనం ప్రజల కోసమే పని చేయాలి, పార్లమెంటు సమావేశాలను విఘాతం కలిగించడం వల్ల ప్రజల విశ్వాసాన్ని పొందే అవకాశం ఉండదు. రాజకీయ విబేధాలకు అతీతంగా నవ భారత నిర్మాణానికి, జాతి పురోగతికి అవిశ్వాసంగా ప్రతి ఒక్కరూ పని చేయాలి’ అని మోదీ పిలుపునిచ్చారు. అలాగే ప్రజాప్రతినిధులుగా వారి ఆశయాలను ఏ మేరకు నెరవేర్చగలిగామన్న అంశాన్ని కూడా ప్రజాప్రతినిధులు ఆత్మపరిశీలన చేసుకోవాలని మోదీ అన్నారు. మోదీ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ప్రభుత్వం పార్లమెంటులో తీసుకుని రాబోతున్న బిల్లులు, శాసనాల గురించి వెల్లడించింది. అలాగే ప్రతిపక్ష పార్టీలు రైతుల సమస్యలు, మంచి నీటి కొరత, నిరుద్యోగం వంటి అంశాలు ప్రస్తావించాయి. 2022 నాటికి నవభారత నిర్మాణ లక్ష్యాన్ని సాధించే దిశగా అన్ని పార్టీల నేతలు ప్రభుత్వంతో సహకరించాలని మోదీ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. అలాగే ప్రజలందరీ వికాసం కోసం, సంక్షేమం కోసం నిర్ధేశించుకున్న లక్ష్యాలను నెరవేర్చుకునేలా తోడ్పాటునందించాలన్నారు. ప్రతిపక్ష పార్టీలు లేవనెత్తే అన్ని అంశాలను ప్రభుత్వం సానుకూలంగా పరిశీలిస్తుందని జాతీయ ప్రాముఖ్యత కలిగిన అంశాలపై పార్లమెంటు ఉభయ సభల్లోనూ చర్చించడానికి సిద్ధంగా ఉందని మోదీ తెలిపారు.
అలాగే ఓకే జాతి, ఒకే ఎన్నికల అన్న అంశంపై చర్చించడానికి ఈ నెల 19న జరిగే అఖిలపక్ష సమావేశానికి అన్ని పార్టీల అధినేతలను మోదీ ఆహ్వానించారు. ప్రస్తుత లోక్‌సభలో కొత్తగా ఎన్నికైన ప్రతినిధులు పెద్ద సంఖ్యలో ఉన్నారని గుర్తు చేసిన మోదీ సభ కూడా సరికొత్త ఉత్సాహంతో కొత్త ఆలోచనలతో ముందుకు సాగాలన్నారు. 19న జరిగే సమావేశంలో భారత దేశ 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల గురించి, మహాత్మా గాంధీ 150వ జయంతి ఉత్సవాల గురించి చర్చిస్తారని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి మీడియాకు వెల్లడించారు. ఈ సమావేశం మర్నాడు ఎంపీలందరితోనూ విందు జరుగుతుందని, వారి అభిప్రాయాలను వ్యక్తీకరించేందుకు అవకాశం కలుగుతుందని జోషి తెలిపారు. ఈ రకమైన ప్రయత్నాల వల్ల జాతి నిర్మాణంలో పార్లమెంటు సభ్యులందరూ కలిసి పని చేయడానికి అవకాశం కలుగుతుందని తెలిపారు. ఈ సమావేశానంతరం ట్వీట్ చేసిన మోదీ అఖిలపక్ష భేటీ సంతృప్తికరంగా సాగిందన్నారు. ఈ సమావేశంలో తమ విలువైన సలహాలు ఇచ్చిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో పాల్గొన్న కాంగ్రెస్ నాయకుడు గులాంనబీ ఆజాద్ మీడియాతో మాట్లాడుతూ ప్రజాకాంక్షలను నెరవేర్చేలా పార్లమెంటు సజావుగా సాగడానికి పరస్పర సహకారంతో పని చేయాలని నిర్ణయించామని తెలిపారు. ప్రజల ప్రయోజనాలకు ఉద్దేశించిన బిల్లులను తాము వ్యతిరేకించబోమని ఆయన తెలిపారు. అయితే నిరుద్యోగం కరవు కాటకాల పరిస్థితులపై చర్చించాల్సిన అవసరం ఉందన్నారు. పార్లమెంటు సమావేశాలు జరగడానికి ముందు అఖిలపక్ష సమావేశం జరగడం ఆనవాయితీగా వస్తోంది.
చిత్రం...ఆదివారం ఢిల్లీలో జరిగిన అఖిల పక్ష సమావేశంలో మాట్లాడుతున్న ప్రధాని నరేంద్ర మోదీ