జాతీయ వార్తలు

సుప్రీంకోర్టులో గాలికి చుక్కెదురు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 1: అక్రమ మైనింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న గాలి జనార్ధన్‌రెడ్డికి వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్‌ను కొట్టివేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ప్రత్యేక న్యాయస్థానంలో పిటిషన్ విచారణ పూర్తియ్యేదాకా ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేమని స్పష్టం చేసింది. గాలి జనార్ధన్‌రెడ్డికి సుప్రీంకోర్టు మంజూరు చేసిన బెయిల్‌ను రద్దు చేయాలంటూ గతంలో ఉమ్మడి ఏపి ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ శుక్రవారం సుప్రీంకోర్టులో జస్టిస్ పినాకి చంద్రఘోష్, జస్టిస్ అమితవరాయ్‌లతో కూడిన ధర్మాసనం ఎదుట విచారణకు వచ్చింది. సుప్రీంకోర్టు ధర్మాసనం కేసు ప్రస్తుత స్థితి ఏమిటి అని ప్రశ్నించగా.. ప్రస్తుతం హైదరాబాద్ ప్రత్యేక న్యాయస్థానం విచారణ జరుపుతోందని, త్వరలో విచారణ కూడా పూర్తికానుందని ఏపి ప్రభుత్వం తరపు న్యాయవాది ధర్మాసనానికి వివరించారు. కాగా ప్రత్యేక న్యాయస్థానంలో విచారణ జరుగుతున్నందున సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్‌ను కొట్టివేయాలని జనార్ధనరెడ్డి, యాదగిరిరావు తరపు న్యాయవాదులు ధర్మాసనాన్ని కోరారు. దీనికి ధర్మాసనం నిరాకరిస్తూ.. సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్ విచారణను యధావిధిగా కొనసాగిస్తామని ధర్మాసనం స్పష్టం చేసింది.