జాతీయ వార్తలు

లోక్‌సభ స్పీకర్ ఎవరు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: పదిహేడవ లోక్‌సభ స్పీకర్ పదవి ఎవరికి దక్కుతుందనేది చర్చనీయాంశంగా మారింది. ఈ పదవికి నలుగురి పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. ప్రొటెం స్పీకర్ వీరేంద్ర కుమార్‌తోపాటు సీనియర్ నాయకులు జువల్ ఓరాం, మాజీ కేంద్ర మంత్రి రాధామోహన్ సింగ్, మాజీ మంత్రి పీపీ చౌదరి పేర్లు పరిశీలనలో ఉన్నాయని అంటున్నారు. అయితే
వీరేంద్ర కుమార్‌ను స్పీకర్‌గా ఎంపిక చేసే అవకాశాలు అధికంగా ఉన్నాయని బీజేపీ నాయకులు చెబుతున్నారు. యూపీఏ హయాంలో అప్పటి ప్రొటెం స్పీకర్ సోమ్‌నాథ్ చటర్జీని స్పీకర్‌గా ఎంపిక చేసినట్లే ఎన్‌డీఏ ప్రభుత్వం ఇప్పుడు వీరేంద్ర కుమార్‌ను స్పీకర్‌గా నియమించవచ్చునని చెబుతున్నారు. లోక్‌సభకు ఇంతవరకు ఏడుసార్లు ఎన్నికైన వీరేంద్ర కుమార్ మొదటి నుంచీ సంఘ్ పరివార్‌తో ఉన్నారు. టీకమ్‌ఘడ్ నుండి లోక్‌సభకు ఎన్నికైన వీరేంద్ర కుమార్ 2014 ఎన్‌డీఏ ప్రభుత్వంలో సహాయ మంత్రిగా పని చేశారు. సంఘ్ పరివార్‌కు అత్యంత సన్నిహితుడైన వీరేంద్ర కుమార్‌ను స్పీకర్‌గా ఎంపిక చేసే అవకాశాలు అధికంగా ఉన్నాయి. గిరిజన వర్గానికి చెందిన మాజీ కేంద్ర మంత్రి జువల్ ఓరాం, మాజీ కేంద్ర మంత్రి రాధామోహన్ సింగ్, రాజస్థాన్‌లోని పాలి లోక్‌సభ నియోజకవర్గం నుండి భారీ మెజారిటీతో విజయం సాధించిన పీపీ చౌదరి పేర్లు కూడా స్పీకర్ పదవికి పరిశీలనలో ఉన్నాయని చెబుతున్నారు.