జాతీయ వార్తలు

స్తంభించిన వైద్యసేవలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: పశ్చిమబెంగాల్‌లో జూనియర్ డాక్టర్లపై దాడులకు నిరసనగా గత వారం రోజులుగా చేపడుతున్న ఆందోళన మరింత తీవ్ర రూపం దాల్చింది. బెంగాల్ జూడాలకు మద్దతుగా దేశవ్యాప్తంగా సోమవారంనాడు దేశవ్యాప్త సమ్మె చేపట్టాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో పలు ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో వైద్యులు సోమవారంనాడు సమ్మెకు దిగారు. ఈ నేపథ్యంలో పలు ఆసుపత్రుల్లో అత్యవసర సేవలు మినహా మిగిలిన సేవలకు తీవ్ర విఘాత కలిగింది. పలుచోట్ల వైద్యులు హెల్మెట్లు, చైన్లు ధరించి పెద్దఎత్తున నిరసన వ్యక్తం చేశారు. వైద్యులు సమ్మెకు దిగడంతో పలు ఆసుపత్రుల్లో చికిత్స కోసం వచ్చిన రోగులు చాలా అవస్థలు పడ్డారు. ఆసుపత్రుల బయటే వేచి చూసిన రోగులు ఈ సమస్యను పరిష్కరించాలని సంబంధిత అధికారులకు విజ్ఞప్తి చేశారు. గత సోమవారంనాడు పశ్చిమబెంగాల్‌లోని ఒక ఆసుపత్రిలో రోగి మరణించడంతో అతని బంధువులు ఇద్దరు జూనియర్ వైద్యులపై భౌతిక దాడులకు పాల్పడడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన సహచర వైద్యులు గత వారం రోజులుగా చేస్తున్న ఆందోళన తీవ్రరూపం దాల్చింది. జూడాలకు మద్దతుగా దేశవ్యాప్తంగా పలు ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో వైద్యులు సోమవారంనాడు సమ్మెలో పాల్గొనడంతో ఔట్ పేషెంట్ విభాగాలు (ఓపీడీ) మూతపడ్డాయి. ముందుగా నిర్ణయించిన పలు ఆపరేషన్లు సైతం వాయిదాపడ్డాయి. అయితే, అత్యవసర సేవలు యథాతథంగా కొనసాగాయి. వైద్యులు, సిబ్బందిపై దాడులు జరుగకుండా వారి పరిరక్షణకు కేంద్ర స్థాయిలో ఒక చట్టాన్ని తీసుకురావాలని ఆందోళనల్లో సమ్మెలో పాల్గొన్న వైద్యులు డిమాండ్ చేశారు. పశ్చిమబెంగాల్ ప్రభుత్వం వైద్యుల సమస్యలపై సత్వరం స్పందించాలని, వారి డిమాండ్లను పరిష్కరించాలని వారు కోరారు. దేశ రాజధాని ఢిల్లీలో ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో వైద్యులు తమ విధులను బహిష్కరించి సమ్మెలో పాల్గొన్నారు. ఆలిండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైనె్సస్ (ఏఐఐఎంఎస్) వైద్యులు తొలుత సోమవారంనాటి సమ్మెలో పాల్గొనకూడదని నిర్ణయించినా చివరకు తమ నిర్ణయాన్ని మార్చుకుని ఆందోళనలో పాల్గొన్నారు. రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ సభ్యులు విధులను బహిష్కరించి, తమ క్యాంపస్‌ల నుంచి బయటకు వచ్చి జూడాలకు మద్దతుగా ఒకరోజు సమ్మెలో పాలుపంచుకున్నారు. ఇదిలావుండగా, జూడాల సమ్మెకు మద్దతుగా మహారాష్టల్రో 40,000కు పైగా వైద్యులు విధులను బహిష్కరించి సమ్మెలో పాల్గొన్నట్టు ఐఎంఏ తెలిపింది. గోవాలో వైద్యులు ‘వౌన నిరసన ప్రదర్శన’ చేపట్టి, బెంగాల్‌లో జూడాలపై జరిగిన భౌతిక దాడులను తీవ్రంగా ఖండించారు. అస్సాం, బిహార్, జార్ఖండ్, ఒడిశా, ఉత్తరప్రదేశ్, తమిళనాడు, కర్నాటక, కేరళ తదితర రాష్ట్రాల్లో సైతం వైద్యులు సమ్మెలో పాల్గొన్నారు.
చిత్రం...పశ్చిమబెంగాల్‌లో జూనియర్ డాక్టర్లపై దాడులకు నిరసనగా సోమవారం దేశవ్యాప్తంగా సమ్మెకు దిగిన వైద్యులు