జాతీయ వార్తలు

స్వామివన్నీ అబద్ధాలే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు, జూన్ 18: జేఎస్‌డబ్ల్యు స్టీల్ భూ వివాదంపై కర్నాటక ముఖ్యమంత్రి కుమార స్వామికి, ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు యెడ్యూరప్పకు మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్నది. యెడ్యూరప్ప లోగడ ముఖ్యమంత్రిగా (2008-11) ఉన్నప్పుడు జేఎస్‌డబ్ల్యు స్టీల్ భూమి ధారాదత్తం చేసే విషయంలో 20 కోట్ల రూపాయలు తీసుకున్నారని ముఖ్యమంత్రి కుమార స్వామి ఆరోపించారు. భూ కుంభకోణంతో తనకు ఏ మాత్రం సంబంధం లేదని, కేవలం తనను అప్రతిష్టపాలు చేసేందుకే ముఖ్యమంత్రి కుమారస్వామి యత్నిస్తున్నారని యెడ్యూరప్ప మంగళవారం ఎదురు దాడి చేశారు. ఈ కుంభకోణంతో తనకు గానీ తన కుటుంబానికి గానీ ఏ మాత్రం సంబంధం లేదని సీబీఐ కోర్టు ఇదివరకే స్పష్టం చేసిందన్నారు. కుమార స్వామి అవాస్తవాలు చెబుతూ, ప్రజలను తప్పుదారి పట్టించే యత్నం చేస్తున్నారని ఆయన విమర్శించారు. వచ్చిన ఆరోపణల్లో వాస్తవం లేదని సీబీఐ కోర్టు తీర్పు స్పష్టంగా చెప్పిందని ఆయన మంగళవారం ట్వీట్ చేశారు. రాజకీయ దురుద్దేశ్యంతో స్వామి ఆరోపణలు చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు.
2016 సంవత్సరం అక్టోబర్ 26న సీబీఐ ఇచ్చిన తీర్పులో యెడ్యూరప్పను, ఆయన కుమారులను, అల్లుడిని నిర్దోషులుగా ప్రకటించింది. 20 కోట్ల రూపాయలు తీసుకున్నట్లు దాఖలైన కేసును కోర్టు తోసిపుచ్చింది. బళ్లారిలోని జేఎస్‌డబ్ల్యు స్టీల్ కంపెనీకి 3,667 ఎకరాల స్థలాన్ని కేటాయిస్తూ కాంగ్రెస్-జేడీ(ఎస్) సంకీర్ణ ప్రభుత్వ మంత్రివర్గం మే 27న నిర్ణయం తీసుకున్నదని బీజేపీ విమర్శించింది. దీంతో కుమార స్వామి ఎదురు దాడికి దిగారు. లోగడ యెడ్యూరప్ప ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జిందాల్ కంపెనీ నుంచి 20 కోట్ల రూపాయల చెక్కును తీసుకున్నారని విమర్శించారు. దీనిపై బహిరంగంగా చర్చించేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్వామి తెలిపారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆనంద్ సింగ్ మంగళవారం మీడియాతో మాట్లాడుతూ ఈ భూమిని విక్రయించడం భావ్యం కాదన్నారు. ముఖ్యమంత్రి స్వామి ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని యెడ్యూరప్ప ధ్వజమెత్తారు.