జాతీయ వార్తలు

లోక్‌సభ స్పీకర్‌గా ఓం బిర్లా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 18: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని బీజేపీ పార్లమెంటరీ బోర్డు అందరి అంచనాలను తలకిందులు చేస్తూ రాజస్థాన్‌కు చెందిన కోటాబుంది ఎంపీ ఓం బిర్లా(56)ను లోక్‌సభ స్పీకర్ పదవికి ఎంపిక చేసింది. స్పీకర్ పదవికి ఓం బిర్లా మంగళవారం మధ్యాహ్నం నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, హోం మంత్రి అమిత్ షా, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ స్పీకర్ పదవికి ఓం బిర్లా పేరు ప్రతిపాదించగా బీజేపీ. శివసేన, నేషనల్ పీపుల్స్ ఫ్రంట్, మిజో నేషనల్ ఫ్రంట్, అకాలీదళ్, ఎల్‌జీపీ, వైఎస్‌ఆర్ కాంగ్రెస్, జేడీ-యూ, అన్నా డీఎంకే, అప్నాదళ్ పార్టీలు ఆయన అభ్యర్థిత్వాన్ని బలపరిచాయి. స్పీకర్ పోస్టుకు మంగళవారం సాయంత్రంలోగా నామినేషన్ పత్రాలు దాఖలు చేయవలసి ఉండగా కేవలం ఓం బిర్లా మాత్రమే నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. నామినేషన్ పత్రాలపై సంతకం చేయటం ద్వారా ఓం బిర్లా అభ్యర్థిత్వాన్ని బలపరచాలని రాజ్యసభలో ప్రతిపక్షం నాయకుడు గులాం నబీ ఆజాద్, లోక్‌సభ సభ్యుడు సురేష్‌ను కోరాను.. అయితే వారినుండి ఎలాంటి స్పందన రాలేదని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి విలేఖరులకు చెప్పారు. ఓం బిర్లా అభ్యర్థిత్వాన్ని ప్రతిపక్షం వ్యతిరేకించదనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. మంగళవారం లోక్‌సభ సమావేశం ముగిసేంతవరకు ప్రతిపక్షం నుండి నామినేషన్ దాఖలు కాకపోవటంతో ఓం బిర్లా ఎంపిక ఏకగ్రీవం అవుతోంది. ఓం బిర్లా స్పీకర్‌గా ఎన్నికైనట్లు బుధవారం ప్రకటిస్తారు. నరేంద్ర మోదీ అధ్యక్షతన సోమవారం రాత్రి జరిగిన బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. బీజేపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జగత్ ప్రకాశ్ నడ్డా మంగళవారం ఉదయం ఓం బిర్లాను తన నివాసానికి పిలిపించుకుని బీజేపీ పార్లమెంటరీ బోర్డు తీసుకున్న నిర్ణయం గురించి తెలియజేశారు. ఓం బిర్లా మంగళవారం స్పీకర్ పదవి కోసం నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. లోక్‌సభ ప్రొటెం స్పీకర్ వీరేంద్ర కుమార్ బుధవారం ఓం బిర్లా చేత స్పీకర్‌గా ప్రమాణ స్వీకారం చేయిస్తారు.
మామూలుగా అయితే అధికారంలో ఉన్న పార్టీకి చెందిన సీనియర్ ఎంపీని లోక్‌సభ స్పీకర్ పదవికి ఎంపిక చేస్తారు. స్పీకర్ పదవిని సమర్థంగా నిర్వహించాలంటే సభ నియమ నిబంధనలు, రాజ్యాంగం బాగా తెలిసి ఉండాలి. ఈ కారణం చేతనే లోక్‌సభకు ఏడెనిమిదిసార్లు ఎన్నికైన సీనియర్ ఎంపీని ఈ పదవికి ఎంపిక చేస్తారు. ప్రొటెం స్పీకర్ ఇప్పటికే ఏడుసార్లు లోక్‌సభకు ఎన్నికైనందున ఆయనే్న స్పీకర్‌గా ఖాయం చేస్తారని భావించారు. అయితే బీజేపీ అధినాయకత్వం దీనికి భిన్నంగా లోక్‌సభకు రెండుసార్లు మాత్రమే ఎన్నికైన ఓం బిర్లాను స్పీకర్ పదవికి ఎంపిక చేసింది. మాజీ స్పీకర్ సుమిత్రా మహాజన్ స్థానంలో ఓం బిర్లా లోక్‌సభ స్పీకర్ పదవిని చేపడతారు. రాజస్థాన్‌లోని కోటా నుండి లోక్‌సభకు రెండోసారి ఎన్నికైన ఓం బిర్లా బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డాకు అత్యంత సన్నిహితుడు. ఇదిలా ఉంటే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ రాజస్థాన్‌లోని మొత్తం 25 స్థానాలను గెలుచుకోవటం తెలిసిందే. ఇన్ని సీట్లిచ్చిన రాజస్థాన్‌కు సముచిత గుర్తింపు ఇవ్వాలనే ఆలోచనతోనే బీజేపీ అధినాయకత్వం ఓం బిర్లాను స్పీకర్ పదవికి ఎంపిక చేసిందని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఓం బిర్లా లోక్‌సభకు రాకముందు మూడుసార్లు రాష్ట్ర శాసనసభకు ఎన్నికయ్యారు.
ఇదిలాఉంటే గతంలో లోక్‌సభకు రెండుసార్లు గెలిచిన తెలుగుదేశం నాయకుడు జీఎంసీ బాలయోగి, ఒకసారి గెలిచిన శివసేన నాయకుడు మనోహర్ జోషి స్పీకర్ పదవి చేపట్టటం తెలిసిందే.