జాతీయ వార్తలు

.. అనే నేను

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 18: తెలంగాణ రాష్ట్రం నుంచి సార్వత్రిక ఎన్నికల్లో గెలిచిన 16 మంది లోక్‌సభ సభ్యులుగా మంగళవారం ప్రమాణ స్వీకారం చేశారు. తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి తొమ్మిది మంది, కాంగ్రెస్ నుంచి ముగ్గురు, బీజేపీ నుంచి ముగ్గురు, మజ్లిస్ నుంచి ఒకరు ప్రమాణ స్వీకారం చేశారు. ఆదిలాబాద్ ఎంపీ సోయం బా బూరావు (బీజేపీ), పెద్దపల్లి ఎంపీ నేతకాని వెంకటేష్ (టీఆర్‌ఎస్), కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ (బీజేపీ), మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి (టీఆర్‌ఎస్), మల్కాజ్‌గిరి ఎం పీ రేవంత్‌రెడ్డి (కాంగ్రెస్), నాగర్‌కర్నూలు ఎంపీ పి.రాములు (టీఆర్‌ఎస్), భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి (కాంగ్రెస్), వరంగల్ ఎంపీ పి.దయాకర్ (టీఆర్‌ఎస్), మహబూబాబాద్ ఎంపీ మాలోతు కవిత (టీఆర్‌ఎస్), ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వర్‌రావు (టీఆర్‌ఎస్) తెలుగులో దైవసాక్షిగా ప్రమాణం చేశారు. అలాగే నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ (బీజేపీ), మహబూబ్‌నగర్ ఎంపీ మనె్న శ్రీనివాస్‌రెడ్డి (టీఆర్‌ఎస్), చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి (టీఆర్‌ఎస్), నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి (కాంగ్రెస్) ఇంగ్లీషులో ప్రమాణం చేశారు. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఉర్దూ లో ప్రమాణ స్వీకారం చేశారు. ఆ సమయంలో బీజేపీ ఎంపీలు జై శ్రీరాం, వందేమాతరం, భారత్ మాతాకి జై అంటూ నినాదాలతో హోరెత్తించారు. ఆ సమయంలో ఒవైసీ బీజేపీ ఎంపీలను మరింతగా నినాదా లు చేయాలని సైగలు చేశారు. ఒవైసీ ప్రమా ణ స్వీకారం పూర్తి చేసిన తరువాత జైభీమ్.. జైభీమ్ .. తాక్‌బీర్ అల్లాహు అక్బర్ అంటూ ముగించారు. కేంద్ర సహాయ మంత్రి కిషన్‌రెడ్డి సోమవారం లోక్‌సభ సభ్యుడిగా ప్ర మాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే.

చిత్రం... లోక్‌సభ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం
పెద్దపల్లి ఎంపీ నేతకాని వెంకటేష్, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వర్‌రావు