జాతీయ వార్తలు

రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు, విభజన చట్టంలో అపరిష్కృతంగా ఉన్న సమస్యల పరిష్కారం కోసం టీఆర్‌ఎస్ ఎంపీలంతా కలిసి కట్టు గా కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తామని ఆ పార్టీ లోక్‌సభా పక్షం నాయకుడు నామా నాగేశ్వరరావు పేర్కొన్నారు. లోక్‌సభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేసిన నా మా పార్లమెంట్ అవరణలో విలేరుఖలతో మాట్లాడారు. తనకు లోక్‌సభ సభ్యుడిగా, లోక్‌సభా పక్షం నాయకుడి గా అవకాశం ఇచ్చినందుకు ప్రజలకు, ముఖ్యమంత్రి
చంద్రశేఖర్‌రావుకు కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ ప్రజలు, టీఆర్‌ఎస్, తమపైన ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటామన్న ఆశాభావం వ్యక్తం చేశారు. గడిచిన ఐదేళ్ల కాలంలో కేంద్రం నుంచి తెలంగాణకు ప్రత్యేకంగా నిధులు ఇచ్చిందేమీ లేదని ఆయన ఆరోపించారు. టీఆర్‌ఎస్ లోక్‌సభా పక్షం ఉపనేత కొత్త ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణకు గడిచిన ఐదేళ్ల కాలంలో కేంద్ర సహకరించలేదని, బీజేపీ నాయకులు కేవలం మాటలకు మాత్రమే పరిమితమయ్యారని ఆరోపించారు. పార్లమెంట్ సభ్యులుగా హైకోర్టు, జాతీయ రహదారులు పోరాటం చేసి సాధించుకున్నామని పేర్కొన్నారు.