జాతీయ వార్తలు

డ్రైవింగ్ లైసెన్సుకు ‘కనీస విద్యార్హత’ తొలగింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 18: డ్రైవింగ్ లైసెన్సు పొందడానికి కనీస విద్యార్హతల నిబంధనను తొలగించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఉపాధి అవకాశాలను పెంపొందించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్టు రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ మంగళవారం తెలిపింది. ప్రస్తుతం సెంట్రల్ మోటర్ వెహికల్ రూల్స్, 1989లోని 8వ నిబంధన కింద ఒక ట్రాన్స్‌పోర్ట్ వెహికల్ డ్రైవర్ కనీసంగా ఎనిమిదో తరగతి ఉత్తీర్ణుడయి ఉండాలి. ‘సమాజంలోని ఆర్థికంగా వెనుకబడి ఉన్న నైపుణ్యం గల వ్యక్తులకు లబ్ధి చేకూర్చడానికి ఒక ట్రాన్స్‌పోర్ట్ వెహికల్‌ను నడపడానికి ఉన్న కనీస విద్యార్హత నిబంధనను తొలగించాలని రోడ్డు ట్రాన్స్‌పోర్ట్, హైవేస్ మంత్రిత్వ శాఖ నిర్ణయించింది’ అని ఒక అధికారిక ప్రకటన వెల్లడించింది. ట్రాన్స్‌పోర్ట్ అండ్ లాజిస్టిక్ సెక్టార్లలో డ్రైవర్ల కొరతను అధిగమించడానికి కూడా ఈ చర్య ఉపయోగపడుతుందని ఆ ప్రకటన వివరించింది.