జాతీయ వార్తలు

చివరివరకు కాంగ్రెస్‌లోనే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 18: తాను బతికి ఉన్నంత వరకూ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని భువనగిరి లోక్‌సభ సభ్యుడు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పేర్కొన్నారు. లోక్‌సభ సభ్యుడిగా వెంకట్‌రెడ్డి పార్లమెంట్‌లో ప్రమాణ స్వీకారం చేసిన తరువాత విలేఖరులతో మాట్లాడారు. తన సోదరుడు, ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి కాంగ్రెస్ విడిచి వెళ్తున్నట్టు ఎక్కడా చెప్పలేదన్నారు. కాంగ్రెస్ పార్టీని ప్రక్షాళన చేయాలని మాత్రమే చెప్పారని సూచించారు. రాజగోపాల్‌రెడ్డి వ్యాఖ్యలపై వెంకట్‌రెడ్డి స్పందిస్తూ.. తన పుట్టుక కాంగ్రెస్‌లోనే.. 33 సంవత్సరాలుగా ఎన్‌ఎస్‌యూఐ కార్యకర్తగా.. యువజన కాంగ్రెస్ నాయకుడిగా.. ఇప్పటివరకు అనేక పదవులు పార్టీలో అనుభవించినట్టు చెప్పారు. ఈ స్థాయికి వచ్చానంటే కాంగ్రెస్ పార్టీ పుణ్యమేనని పేర్కొన్నారు. తాను చనిపోయేంతవరకు కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతనని వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ గురించి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తాను విన్నానని.. పార్టీ బాగుండాలని.. ఎన్నికల్లో గెలవాలని.. తెలంగాణ ఇచ్చి రెండోసారి కూడా గెలవలేకపోయినట్టు చెప్పారని అన్నారు. పార్టీని ప్రక్షాళన చేయాలని కోరారే తప్ప పార్టీ మారుతున్నట్టు చెప్పలేదని వివరించారు. కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో అధికారంలోకి తీసుకొచ్చే విధంగా కృషి చేస్తానని అన్నారు. భువనగిరి నియోజకవర్గం అభివృద్ధికోసం అన్ని విధాలా కృషి చేస్తానని చెప్పారు. విభజన హామీల్లో తెలంగాణకు ఇచ్చిన ఎయిమ్స్ వచ్చినప్పటికీ వౌలిక సాదుపాయాల లేమితో సమస్యలను ఎదుర్కొంటోందని అన్నారు. ఎయిమ్స్ అభివృద్ధికోసం కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తామని పేర్కొన్నారు. హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి ఎనిమిది లైన్ల విస్తరణ కోసం కేంద్రంపై ఒత్తిడి పెంచుతామన్నారు.

చిత్రం... పార్లమెంట్ ఆవరణలో కోమటిరెడ్డి వెంకట రెడ్డి