జాతీయ వార్తలు

ఏం చేద్దాం..చెప్పండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: కొత్త బడ్జెట్‌కు కసరత్తు మొదలైంది. ఆర్థిక వ్యవస్థకు మరింత ఊతాన్ని ఇవ్వడంతో పాటు అదనంగా ఉపాధి అవకాశాలను పెంపొందించడంపై కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా మంగళవారం నాడు ప్రధాని నరేంద్ర మోదీ ఆర్థిక ఇతర మంత్రిత్వ శాఖల ఉన్నతాధికారులతో విస్తృత స్థాయి మంతనాలు జరిపారు. ప్రస్తుత పరిస్థితుల నుంచి గట్టెక్కి ఆర్థిక వ్యవస్థను ప్రగతి పథంలో పరుగులు పెట్టించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఈ సందర్భంగా ఆయన చర్చించారు. ప్రధాని అధికార నివాసంలో జరిగిన ఈ సమావేశానికి ఆర్థిక మంత్రిత్వ శాఖకు చెందిన ఐదుగురు కార్యదర్శులు, అలాగే నీతి ఆయోగ్ అధికారులు కూడా హాజరైనట్లు తెలుస్తోంది. దేశంలో వ్యాపారానుకూలతను పెంపొందించడంతో పాటు ఆర్థిక పుష్టిని సాధించడానికి అమలు చేయాల్సిన సంస్కరణలను, రోడ్డు మ్యాప్‌పై ఈ సందర్భంగా చర్చ జరిగినట్లు స్పష్టమవుతోంది. ముఖ్యంగా రెవెన్యూ వసూళ్ళను పెంపొందించుకోవడం, స్తూల జాతీయోత్పత్తి వృద్ధి రేటుకు ఊతాన్ని ఇచ్చేలా సంస్కరణలను అమలు చేయడం వంటి అంశాలపై ఈ సందర్భంగా విస్తృత చర్చ జరిగినట్లు అధికారవర్గాలు తెలిపాయి.
ఐదేళ్ళ కనిష్టానికి జీడీపీ వృద్ధి రేటు చేరుకున్న నేపథ్యంలో వృద్ధి రేటుకు ఊతాన్ని ఇచ్చే అంశంపై ఈ సందర్భంగా చర్చించినట్లుగా చెబుతున్నారు. ద్రవ్యోల్భణ స్థాయి ఆర్‌బిఐ నిర్ధేశించిన పరిథిలోనే ఉన్నప్పటికీ జనవరి-మార్చి త్రైమాసికంలో ఆర్థిక వృద్ధి రేటు ఐదేళ్ళ కనీష్టానికి అంటే 5.8 శాతానికి పడిపోయింది. ముఖ్యంగా వ్యవసాయం, తయారీ రంగాల్లోనే ఈ లోటు కనిపించింది. ఫలితంగా చైనాకు దిగువ స్థాయి భారత్ చేరుకుంది. ఈ నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థకు ఊతాన్ని ఇవ్వడంతో పాటు అన్ని రంగాల్లో ప్రగతి పథంలో పరుగులు పెట్టేలా మోదీ సర్కారు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే కొత్త ఆలోచనల కోసం అన్ని శాఖల అధికారులతో చర్చలు జరుపుతోంది. వీటన్నింటి ప్రాతిపదికగానే కొత్త బడ్జెట్‌కు రూపకల్పన జరిగే అవకాశం కనిపిస్తోంది. వ్యవసాయ రంగంలో చోటు చేసుకున్న ప్రతికూల పరిస్థితులను తొలగించడంతో పాటు రైతుల ఆదాయాన్ని పెంచేందుకు కొత్త బడ్జెట్ ద్వారా మోదీ సర్కారు ప్రయత్నించబోతున్నది. ఆర్థిక రంగంలో ఎదురవుతున్న సమస్యలు, విత్తపరమైన సవాళ్ళు, ఉపాధి కల్పనా, ప్రైవేటు పెట్టుబడులు, ఎగుమతుల పునరుద్ధరణ వంటి అనేక అంశాలపై తగిన పరిష్కార చర్యలను ప్రతిపాదిస్తూ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కొత్త బడ్జెట్‌ను ప్రవేశ పెట్టే అవకాశం ఉంది.