జాతీయ వార్తలు

రాజ్యాంగ సంస్కృతిని న్యాయవ్యవస్థ పరిరక్షించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 19: రాజ్యాంగ స్ఫూర్తిని, సంస్కృతిని న్యాయవ్యవస్థ పరిరక్షించాలని, అవి చిన్నాభిన్నం కాకుండా చూడాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ పిలుపునిచ్చారు. ఇక్కడికి అందిన సమాచారం ప్రకారం..ప్రస్తుతం రష్యాలోని సోచిలో ఉన్న గొగోయ్ ఒక సదస్సులో మాట్లాడుతూ న్యాయవ్యవస్థ అత్యంత జాగురూకతతో వ్యవహరించాలని అన్నారు. ఒక దేశ ప్రస్థానంలో చట్టసభలు, పాలక మండలితోపాటు న్యాయవ్యవస్థ కూడా అత్యంత కీలక పాత్ర పోషిస్తుందని ఆయన అన్నారు. రాజ్యాంగాన్ని పరిరక్షించి, తదనుగుణంగా పాలన సాగేలా చూడాల్సిన బాధ్యతను న్యాయవ్యవస్థ తీసుకోవాలని ఆయన పేర్కొన్నారు. ఎలాంటి ఎన్నిక లేకుండా నియమింపబడుతున్న న్యాయమూర్తులు రాజ్యాంగపరంగా ఎన్నికైన ప్రతినిధుల నిర్ణయాలను అడ్డుకోవడం సమంజసం కాదన్న వాదన బలంగా వినిపిస్తున్నదని గొగోయ్ అన్నారు. అయితే, అన్ని అంశాల్లోనూ న్యాయవ్యవస్థ జోక్యం చేసుకోదని ఆయన అన్నారు. రాజ్యాంగ స్ఫూర్తికి భంగం కలిగించే అంశాలను మాత్రమే పరిశీలించి, విశే్లషించి నిర్ణయాలు తీసుకోవాలని ఆయన అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఇదే పరిస్థితి కొనసాగుతోందని ఆయన గుర్తు చేశారు.

చిత్రం... సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్