జాతీయ వార్తలు

వారిది పార్టీ ఫిరాయింపే.. న్యాయ పోరాటం చేస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 20: భారతీయ జనతా పార్టీలో చేరిన నలుగురు తెలుగుదేశం రాజ్యసభ సభ్యులు పార్టీ ఫిరాయిపులకు పాల్పడ్డారని తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ ఆరోపించింది. తెలుగుదేశం పార్టీ లోక్‌సభ సభ్యులు గల్లా జయ్‌దేవ్, రామ్మోహన్‌నాయుడు, కేశినేని నాని, రాజ్యసభ సభ్యులు కనకమేడల రవింద్రకుమార్, తోట సీతారామలక్ష్మి గురువారం విలేఖరులతో మాట్లాడుతూ నలుగురు రాజ్యసభ సభ్యులూ పార్టీ మారడాన్ని వారు తప్పుబట్టారు. గల్లా జయ్‌దేవ్ మాట్లాడుతూ బీజేపీలో నలుగురు ఎంపీలు తమకు తెలియకుండానే తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ సమావేశం జరగకుండానే పార్టీ రాజ్యసభ పక్షాన్ని విలీనం చేశారని ఆరోపించారు. రాజ్యసభ తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ బీజేపీలో విలీనం చేయాలని తెలుగుదేశం పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యులు రాజ్యసభ చైర్మన్‌కు లేఖ రాయడాన్ని ఆయన తప్పుబట్టారు. దీనిపై న్యాయపరమైన అభిప్రాయం తీసుకోవడంతో పాటు న్యాయపోరాటం చేస్తామని ప్రకటించారు. అలాగే, రామ్మోహన్‌నాయుడు విలేఖరులతో మాట్లాడుతూ పార్టీకి ద్రోహం చేసే చర్యలు సరైనవి కావని పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ కారణంగానే మేమంతా ఈ పదవులు అనుభవిస్తున్నామని, అలాంటి పార్టీని వీడటం మంచిది కాదన్నారు. ఎన్నికల్లో పార్టీ ఓడిపోయిందన్న కారణంతో పార్టీకి చెందని రాజ్యసభ సభ్యులు ఇలా చేయడం సమంజసం కాదన్నారు. పార్టీ ఓడిపోయినప్పటికీ గ్రామ స్థాయి నుంచి తమ పార్టీ పటిష్టంగానే ఉందని వెల్లడించారు. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించడం బీజేపీకి తగదని, రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు దీనిపై ఒక నిర్ణయం తీసుకోవాలని పేర్కొన్నారు. పార్టీ బలహీనపడుతుందన్న మైండ్ గేమ్‌కు వైఎస్సార్ కాంగ్రెస్, బీజేపీలు తెర మీదకు తీసుకొచ్చాయని ఆయన ఆరోపించారు. ఏపీ ప్రజల తెలుగుదేశం అజెండాను పార్లమెంట్‌లో తాము కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు. పార్టీ మారడంలో బీజేపీ, వైఎస్సార్ కాంగ్రెస్ నాయకుల వ్యాఖ్యలు చూస్తుంటే దీని వెనుక పెద్ద కుట్ర జరిగిందన్నారు. అలాగే, ఎంపీ కేశినేని నాని మాట్లాడుతూ బీజేపీ అధికారంలో ఉన్నంతకాలం ఏ.పీకి ప్రత్యేకహోదా ఇచ్చే ప్రసక్తే లేదన్నారు. జగన్‌మోహన్‌రెడ్డి ప్రత్యేక హోదా అంశాన్ని సాధిస్తానని ఎన్నికల్లో ప్రకటనలు చేయడంతో ప్రజలు ఆయన్ని గెలిపించారని, కేంద్రంపై పోరాటం చేసి ప్రత్యేక హోదా సాధించాలన్నారు. ప్రత్యేకహోదా విషయంలో కేంద్రంతో తన వైఖరి జగన్ స్పష్టం చేయాలన్నారు.
మోదీతో ఘర్షణ వద్దని
బాబుకి చెప్పా: సుజనా చౌదరి.
బీజేపీతోప్రధాని నరేంద్రమోదీతో విభేదం మంచిది కాదని ఏన్డీయే నుంచి బయటకు వచ్చిన సమయంలో తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడికి చెప్పినట్టు రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి పేర్కొన్నారు. బీజేపీలో చేరిన అనంతరం తన నివాసంలో ఆయన విలేఖరులతో మాట్లాడుతూ దేశాభివృద్ధికి నరేంద్రమోదీయే సరైన నాయకుడని నమ్ముతున్నాని, అందుకే బీజేపీలో చేరినట్టు చెప్పారు. తనపై ఎలాంటి ఫిర్యాదులు, చార్జిషీట్‌లు లేవని, తనపై వచ్చినవన్నీ అభియోగాలు మాత్రమేనని పేర్కొన్నారు. 2004లోనే తాను వ్యాపారం నుంచి బయటకు వచ్చానని వ్యాపారాలు ఉన్నప్పుడు కూడా ప్రభుత్వం నుంచి ఎప్పుడూ తాను లబ్ధి పొందలేదని అన్నారు. ఏపీకి కేంద్ర ప్రభుత్వం ప్యాకేజి రూపంలో ఇవ్వడానికి సిద్ధపడిందని, ఏపీకి ప్రత్యేక హోదా కోసం కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చినట్టు చెప్పారు. ఏపీకి ప్రత్యేకహోదా అంశం ముగిసిన అధ్యాయమేనని తాను అభిప్రాయం వ్యక్తం చేస్తునట్టు చెప్పారు. రాష్ట్రానికి లబ్ధి చేకూరే అంశాల కోసం పాటుపడేందుకు తాను కృషి చేస్తానని స్పష్టం చేశారు. తన రాజకీయ గురువు చంద్రబాబేనని.. రాజకీయాల్లో ఓనమాలు నేర్పించింది ఆయనేనని పేర్కొన్నారు. 2004 నుంచి తాను పార్టీలోనే ఉన్నానని, కష్టకాలంలోనూ పార్టీలోనే కొనసాగిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. పార్టీ కోసం తాను ఎంత కష్టపడ్డానో చంద్రబాబుకి తెలుసన్నారు. ఏపీలో తెలుగుదేశం పార్టీ నిలదొక్కుకోవాలని ఆకాంక్షించే తొలి వరస వ్యకుల్లో తాను ఒకరినని పేర్కొన్నారు. తనతో పాటు మరో ముగ్గురు రాజ్యసభ సభ్యులు బీజేపీలో చేరారని, వారు తన ప్రోద్బలంతో చేరలేదని సుజనాచౌదరి స్పష్టం చేశారు.