జాతీయ వార్తలు

ఆధార్ స్వచ్ఛందమే...తప్పనిసరి కాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 24: ప్రజలు ‘ఆధార్’ను బ్యాంక్ అకౌంట్లను ప్రారంభించుకోవడానికి, మొబైల్ ఫోన్ల ‘సిమ్’ కార్డులను ఖరీదు చేసేప్పుడు స్వచ్ఛందంగా ఇవ్వాలే తప్ప తప్పని సరి కాదంటూ కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు సోమవారం లోక్‌సభలో ప్రభుత్వం ఆర్డినెన్స్ స్థానే బిల్లును ప్రవేశపెట్టింది. 2016 సంవత్సరం నాటి ఆధార్ చట్టాన్ని సవరిస్తూ బిల్లును సభ ఆమోదం కోసం ప్రతిపాదించింది. ఇలాఉండగా ఆర్‌ఎస్‌పి లోక్‌సభ సభ్యుడు ఎన్‌కె ప్రేంచందరన్ బిల్లును తీవ్రంగా వ్యతిరేకించారు. ఆధార్ వినియోగంపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును ఉల్లంఘించే విధంగా బిల్లు ఉందన్నారు. ఆధార్ కార్డుతో వ్యక్తిగత వివరాలు సేకరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్‌ఎస్‌పీ సభ్యుడు ప్రేంచందరన్ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర సమాచార, సాంకేతిక శాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్ స్పందిస్తూ ఆధార్ అనేది చెల్లుబాటు అయ్యే చట్టం అన్నారు. జాతి ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని చేసిందే తప్ప వ్యక్తిగత అంశాలను సేకరించేందుకు కాదని ఆయన స్పష్టం చేశారు. ఉన్నత న్యాయ స్థానం సూచనల మేరకు బిల్లును రూపొందించామని ఆయన తెలిపారు. దేశ ప్రజలు ఆధార్‌ను ఆమోదించారని చెప్పారు. దేశంలోని 60 కోట్ల మంది కొత్తగా మొబైల్ సిమ్ కార్డులు ఖరీదు చేసేందుకు, బ్యాంకుల్లో ఖాతాలు తెరిచేందుకు ఆధార్‌ను ఉపయోగించారని అన్నారు. సుప్రీం కోర్టు సూచన మేరకు ఇప్పుడు ఆధార్ తప్పని సరి ఏమీ కాదని ఆయన చెప్పారు. ఆధార్ అనేది వ్యక్తుల గుర్తింపు కార్డుగా ఉపయోగంలో ఉంటుందే తప్ప వ్యక్తిగత వివరాలను ఎవరూ హరించరని అన్నారు. ఒకవేళ ఆధార్ చట్టాన్ని ఎవరైనా ఉల్లంఘించినట్లయితే కఠిన చర్యలు ఉంటాయని, కోటి రూపాయల వరకు జరిమానా విధించడం జరుగుతుందని కేంద్ర మంత్రి రవి శంకర్ ప్రసాద్ హెచ్చరించారు.