జాతీయ వార్తలు

లక్షిత దాడుల్లో గురి తప్పలేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గ్వాలియర్, జూన్ 24: గగనతలాన్ని మూసివేయడం పాక్‌దేశానికి సంబంధించి సమస్యగా ఎయిర్ చీఫ్ మార్షల్ బీఎస్ ధనోవా స్పష్టం చేశారు. బాలాకోట్‌పై భారత్ లక్షిత దాడుల తరువాత గగనతాలాన్ని పాక్ మూసివేసింది. కార్గిల్ యుద్ధం జరిగి 20 ఏళ్లయిన సందర్భంగా గ్వాలియర్‌లోని వైమానిక స్థావరం వద్ద సోమవారం జరిగిన ఓ ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యఅతిధి ఎయిర్ చీఫ్ మార్షల్ ధనోవా మాట్లాడుతూ ‘మనం ఎప్పుడూ ఇలాంటి చర్యలకు పాల్పడలేదు. గగగతలాన్ని మూసివేయడం అన్నది పాకిస్తాన్ సమస్యే’అని స్పష్టం చేశారు. ఉగ్రస్థావరాలను లక్ష్యంగా దాడులు చేయాలన్నది భారత్ లక్ష్యమని, దాన్ని విజయవంతంగా పూర్తిచేసినట్టు ఆయన వెల్లడించారు. పాక్ మాత్రం నియంత్రణరేఖ దాటడానికి విఫల యత్నం చేసిందని ఆయన తెలిపారు. కార్గిల్ యుద్ధంలో భారత దళాలు చూపిన ధైర్యసాహసాలు అజరామరమని, భావితరాలు గుర్తుంచుకుంటాయని ధనోవా పేర్కొన్నారు. దేశం కోసం ప్రాణాలర్పించిన త్యాగధనుల సేవలు గుర్తించుకునేందుకు గ్యాలియర్ ఎయిర్‌బేస్‌లో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు ఆయన వెల్లడించారు. జమ్మూకాశ్మీర్‌లోని డ్రాస్-కార్గిల్ ప్రాంతంలో టైగర్‌హిల్‌పై దాడి సంఘటనను ఆయనీ సందర్భంగా గుర్తుచేశారు. 2000 మిరాజ్ విమానాలు ఐదు, మిగ్-21 రెండు, 30ఎంకేఐ సుఖొయ్ ప్రదర్శించారు. ఫిబ్రవరిలో బాలాకోట్‌పై జరిగిన వైమానిక దాడిలో పాల్గొన్న మిరాజ్ 2000 యుద్ధ విమానం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సైన్యంలో మరో 20 ఏళ్లు సేవలిందించేలా మిరాజ్ 2000ను అభివృద్ధి చేస్తున్నట్టు ఎయిర్ మార్షల్ రాజేష్‌కుమార్ వెల్లడించారు. ఆపరేషన్ విజయ్ కార్యక్రమంలో పరువురు శౌర్యపతాక గ్రహీతలు, సర్వీసుల్లో ఉన్నవారు, రిటైర్డ్ సైనిక అధికారులు పాల్గొన్నారు. కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా దేశ రాజధాని ఢిల్లీ, జమ్మూకాశ్మీర్‌లోని డ్రాస్ పట్టణంలో వచ్చే నెలలో పలు కార్యక్రమాలు చేపట్టనున్నారు. జూలై 25 నుంచి 27 వరకూ పలు కార్యక్రమాలుంటాయి. ఢిల్లీలోని యుద్ధవీరుల స్మారక స్థూపం వద్ద 14న విజయజ్యోతిని వెలిగిస్తారు.