జాతీయ వార్తలు

నీటి సంక్షోభంపై జైల్‌భరో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై, జూన్ 24: తమిళనాడు రాజధాని చెన్నై నగరంలోనీటి సంక్షోభం తారస్థాయి చేరుకుంది. పరిస్థితి ఇంత దారుణంగా తయారవ్వడానికి అన్నాడీఎంకే ప్రభుత్వమే కారణమని డీఎంకే మండిపడుతోంది. ముఖ్యమంత్రి కే పళనిస్వామి ప్రభుత్వం ఘోర వైఫల్యానికి నిరసనగా డీఏంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ నాయకత్వంలో సోమవారం ఇక్కడ భారీ ర్యాలీ జరిగింది.
‘పదవులను కాపాడుకునేందుకే యజ్ఞాలు, యాగాల పేరుతో అధికార పార్టీ నేతలు నాటకాలు ఆడుతున్నారు’అని స్టాలిన్ నిప్పులు చెరిగారు. వర్షాలు కురవాలని, జనం కష్టాలు తీరాలన్న ధ్యాస అన్నాడీఎంకేకు లేదని ఆయన విమర్శించారు. ప్రభుత్వం తక్షణం నీటి ఎద్దడి నివారణకు చర్యలు చేపట్టని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా జైల్‌భరో కార్యక్రమం చేపడతామని స్టాలిన్ ప్రకటించారు.
అయితే డీఎంకే చేపట్టిన నిరసన కార్యక్రమానికి ప్రజల మద్దతు లేదని అన్నాడీఎంకే నేత జయకుమార్ చెప్పారు. డీఎంకే అధినేత స్టాలిన్ ఖాళీ కడవ చేతబట్టి నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. ‘కూడం ఇంగే...కుదినీర్ ఎంగే?’ కుండ ఇదిగో..నీళ్లేక్కడ? ’అంటూ స్టాలిన్ నినదించారు. ఉద్యోగాల కొరత, పథకాల కొరత, నిధుల కొరత, పరిశ్రమల కొరత, శాంతి భద్రతల కొరత ఇప్పుడు నీటి కొరత అంటూ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. సీఎం పళనిస్వామి, డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వం, మున్సిపల్ మంత్రి ఎస్పీ వేలుమణికి ప్రజాసమస్యలు పట్టవని డీఎంకే చీఫ్ విమర్శించారు. కేంద్రం చేతిలో కీలుబొమ్మగా మారిపోయిన అన్నాడీఎంకే ప్రభుత్వం పరిస్థితిని చక్కదిద్దేచర్యలు చేపట్టలేకపోతోందని స్టాలిన్ ధ్వజమెత్తారు. యాగాలు చేయడం తప్పని చెప్పడానికి తాను ఇక్కడకు రాలేదని, నీటి కొరత ముప్పు పొంచి ఉన్నట్టు సంకేతాలున్నా ప్రభుత్వం స్పందించలేదనని ఆయన పేర్కొన్నారు.
చిత్రం... సోమవారం చెన్నైలో జరిగిన నిరసన కార్యక్రమంలో మాట్లాడుతున్న డీఎంకే నాయకులు స్టాలిన్, దయానిధి మారన్