జాతీయ వార్తలు

దేశ రక్షణలో రాజీ లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 24: దేశ రక్షణ వ్యవస్థ విషయంలో తాము ఎలాంటి రాజీ పడబోమని, ఇందుకు నిధుల కొరత ఏమీ లేదని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. రాజ్యసభలో సోమవారంనాడు జీరో అవర్‌లో ఒక సభ్యుడు అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి సమాధానం ఇస్తూ దేశ రక్షణ విషయంలో ఏకోశానా రాజీ పడబోమని స్పష్టం చేశారు. ‘దేశ రక్షణ కోసం నిధుల కొరత లేకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపడుతున్నాం. ఇందుకు అనుగుణంగా బడ్జెట్‌లో తగిన నిధులు కేటాయిస్తున్నాం. దేశ రక్షణలో కేంద్ర ప్రభుత్వం ఎలాంటి రాజీ పడబోదు’ అని ఆయన సభ్యులకు భరోసా ఇచ్చారు. రక్షణ రంగానికి ఎక్కువ నిధులు కేటాయించే విషయంలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొంటామని, ఇదే తరుణంలో ప్రతికూల పరిస్థితుల ప్రభావం పడకుండా జాగ్రత్త చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. గత కొనే్నళ్లుగా రక్షణ రంగానికి బడ్జెట్‌లో నిధుల కేటాయింపులను పెంచిన విషయాన్ని కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ ఒక సభ్యుడు అడిగిన అనుబంధ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. 2019-20 ఆర్థిక సంవత్సరంలో మొత్తం నిధుల్లో కేంద్ర ప్రభుత్వం 32.19 శాతం నిధులను రక్షణ రంగానికి వెచ్చించిందని, ఇది మిగిలిన కేంద్ర మంత్రులందరి కంటే ఎక్కువ అని ఆయన పేర్కొన్నారు. దేశ రక్షణ రంగం కోసం నిధులు వెచ్చించడంలో పరిమితులేమీ లేవని, ఈ రంగాన్ని మరింత ఆధునికంగా తీర్చిదిద్దేందుకు తగిన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. రక్షణ రంగానికి నిధుల కేటాయింపు విషయంలో ఉన్నతాధికారుల తరఫున ఎలాంటి అవరోధాలు, అడ్డంకులు లేవని, దీనివల్ల జాప్యం జరిగేందుకు ఆస్కారం లేదని ఆయన అన్నారు. అదేవిధంగా సాయుధ దళాలకు అధికారాలు బదలాయించే విషయంలో కూడా ఎలాంటి జాప్యానికి తావు లేదని ఆయన స్పష్టం చేశారు. రక్షణ రంగానికి బడ్జెట్‌లో కేటాయించిన నిధులను నూటికి నూరు శాతం వెచ్చించామని, ఈ విషయంలో ఎలాంటి అనుమానాలకు చానే్స లేదని ఆయన పేర్కొన్నారు.
చిత్రం... రాజ్యసభలో సోమవారం మాట్లాడుతున్న రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్