జాతీయ వార్తలు

ప్రత్యేక హోదా ప్రతిపాదన ఏదీ లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 24: రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇచ్చే ప్రతిపాదన ఏదీ కేంద్ర ప్రభుత్వ పరిశీలనలో లేదని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం స్పష్టం చేశారు. బిహార్, ఆంధ్రప్రదేశ్ ఇతర వెనుకబడిన రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇచ్చే విషయం పరిశీలనలో ఉన్నదా అంటూ జేడీ-యూ సభ్యుడు కౌషలేంద్ర కుమార్ అడిగిన ప్రశ్నకు నిర్మలా సీతారామన్ రాతపూర్వకంగా ఇచ్చిన సమాధానంలో ఈ విషయం తెలిపారు. పర్వత ప్రాంతాలు, జన సాంద్రత తక్కువగా ఉండటం, గిరిజన ప్రజలుండటం, ఆర్థిక, వౌలిక సదుపాయాల కొరత, ఆర్థిక వనరుల కొరత తదితర కారణాలుంటేనే ప్రత్యేక హోదా లభిస్తుందన్నారు. ఎన్‌డీసీ ప్రణాళిక సహాయం కోసం ఇచ్చే ప్రత్యేక హోదాలో పరిశ్రమల అభివృద్ధికి సంబంధించిన ప్రత్యేక చర్యలేవీ ఉండవని నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు.

చిత్రం... కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్