జాతీయ వార్తలు

ఆ వివరాలు వెల్లడించలేం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 24: లోక్‌సభ ఎన్నికల సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ప్రసంగాలు ఎన్నికల నియమావళిని ఉల్లంఘించేవిగా ఉన్నాయంటూ వచ్చిన ఆరోపణలపై ఎన్నికల కమిషనర్ అశోక్ లవాస వ్యక్తం చేసిన అసమ్మతి వాదనను వెల్లడించలేమని ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది. ప్రధాని మోదీ కోడ్ ఉల్లంఘనపై ఇసి తీసుకున్న నిర్ణయాలపై అశోక్ లవాస అసమ్మతిని వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ అసమ్మతి వివరాలు వెల్లడించాలంటూ దాఖలైన సమాచార హక్కు పిటీషన్‌ను తిరస్కరించిన ఎన్నికల కమిషన్ ‘ఈ వివరాలు వెల్లడిస్తే ఓ వ్యక్తి జీవితానికి, భౌతిక భద్రతకు’ ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంటుందని వ్యక్తం చేసింది.
పుణేకు చెందిన కార్యకర్త విహార్ దుర్వే ఆర్‌టీఐ కింద కమిషనర్ వ్యక్తం చేసిన అసమ్మతి వివరాలు వెల్లడించాలని కోరారు. ఏప్రిల్ 1న వాద్రాలో, ఏప్రిల్ 9న లాతూర్‌లో, ఏప్రిల్ 21న పఠాన్, బార్నర్‌లో, ఏప్రిల్ 25న వారణాసిలో ప్రధాని మోదీ చేసిన ప్రసంగాలపై అనేక ఫిర్యాదులు ఇసీకి వచ్చాయి. దీంతో ప్రధాని మోదీకి కమిషనర్ నోటీసులు పంపించారు. ఆ వివరాలు కావాలన్న పిటీషనర్ పిటీషన్‌ను ఎన్నికల కమిషన్ తోసిపుచ్చింది. ఎన్నికల కమిషన్ చట్టంలోని సెక్షన్ 8(1)(జి) ప్రకారం ఆర్‌టీఐ కింద అడిగే సమాచారాన్ని ఇవ్వడానికి వీలు లేదని కమిషన్ స్పష్టం చేసింది. ఈ సమాచారాన్ని ఇచ్చినట్లయితే వ్యక్తి భద్రతలకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని తెలిపింది. ప్రధాని మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై ఆరోపణలు వచ్చినప్పటికీ, ఆ వ్యాఖ్యల్లో తప్పేమి లేదంటూ ఎన్నికల కమిషన్ క్లీన్ చిట్ ఇచ్చిన దాఖలాలు ఉన్నాయంటూ పిటీషనర్ చేసిన ఆరోపణను ఎన్నికల కమిషన్ తోసిపుచ్చింది. ఎన్నికల కమిషన్ నియామవళి ప్రకారమే తాము నడుచుకున్నామని కమిషన్ వివరించింది. ఇలాఉండగా సోమవారం ఎన్నికల కమిషన్ సమావేశమై ఎన్నికల నియామవళి అమలుపై సమీక్షించింది.