జాతీయ వార్తలు

‘గ్రామ వాస్తవ్య’ పేరిట డ్రామాలు: యెడ్యూరప్ప

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు, జూన్ 24: ముఖ్యమంత్రి హెచ్.డీ.కుమారస్వామి ‘గ్రామ వాస్తవ్య’ (గ్రామాల్లో రాత్రి నిద్ర) పథకం పేరిట ‘డ్రామా’ ఆడుతున్నారని, అధికార కాంగ్రెస్, జేడీ(ఎస్) నేతలు రోజూ వీధి పోరాటాలకు దిగుతున్నారని, కానీ ఇపుడు ప్రజలకు కావాల్సింది కాస్త ప్రశాంతత అని బీజేపీ కర్నాటక అధ్యక్షుడు బి. యెడ్యూరప్ప వ్యాఖ్యానించారు. ‘గ్రామ వాస్తవ్య’ పేరిట ముఖ్యమంత్రి కోట్లాది రూపాయల ప్రజా ధనాన్ని వృథా చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ‘గ్రామ వాస్తవ్య’ పథకంలో భాగంగా గత వారంలో యాదగిర్ జిల్లాలోని చంద్రకి గ్రామంలో బస చేసేందుకు ముఖ్యమంత్రి కోటి రూపాయలు ఖర్చు చేశారని ఆయన విమర్శించారు. ‘గ్రామ వాస్తవ్య’ అనేది ప్రజల వద్దకు పరిపాలనను తీసుకెళ్లడమేనని ఆయన అన్నారు. అయితే, రాష్ట్రంలో అధికారంలో కొనసాగుతున్న కాంగ్రెస్-జేడీ(ఎస్) సంకీర్ణ ప్రభుత్వ నేతల మధ్య జరుగుతున్న అంతర్గత విభేదాల వల్ల సర్కారు ఎప్పుడైనా కూలిపోవచ్చునని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు యెడ్యూరప్ప జోస్యం చెప్పారు. ‘యాదగిర్ జిల్లాలోని చంద్రకి గ్రామంలో బస చేసేందుకు సీఎం 1.22 కోట్ల రూపాయల ప్రజా ధనాన్ని ఖర్చు చేశారు. ఇది నిజంగా సిగ్గుచేటైన విషయం’ అని ఆయన ధ్వజమెత్తారు. అదేవిధంగా ముఖ్యమంత్రి రాయిచూర్ జిల్లాలోని కరెగుడ్డలో ఈనెల 26న నిర్వహించబోయే గ్రామ వాస్తవ్య కార్యక్రమానికి కనీసం మరో కోటి రూపాయల ప్రజా ధనాన్ని వెచ్చించనున్నారని, పాలనా యంత్రాంగాన్నంతా ఫైవ్ స్టార్ హోటల్‌లో నడిపించడం ఇదేనా ఆయన (సీఎం) అనుసరించే సాధారణ జీవితం అని యెడ్యూరప్ప ప్రశ్నించారు. ఇదిలావుండగా, గ్రామ వాస్తవ్య-సున్నా ప్రగతి’ పేరిట బీజేపీ రాష్ట్ర శాఖ సోమవారంనాడు ఒక పుస్తకాన్ని విడుదల చేసింది. 2006-07 మధ్య కాలంలో కుమారస్వామి ముఖ్యమంత్రిగా వ్యవహరించినపుడు 42 గ్రామాల్లో ప్రస్తుత తీరుతెన్నుల గురించి ఆ పుస్తకంలో సోదాహరణంగా పేర్కొన్నారు. ముఖ్యమంత్రి అధికార యంత్రాంగంపై పట్టు కోల్పోయారని, జిల్లా ఇన్‌చార్జి మంత్రులపై ఆయనకు విశ్వాసం లేదని యెడ్యూరప్ప వ్యాఖ్యానించారు. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో దేశం అభివృద్ధి చెందుతున్న తరుణంలో ‘గ్రామ-డ్రామా’ పేరిట ‘గ్రామ వాస్తవ్య’ కార్యక్రమం ద్వారా ప్రజా సమస్యల పరిష్కారం అంటూ ఆటలాడడం ఎందుకని ఆయన ముఖ్యమంత్రి కుమారస్వామిని సూటిగా ప్రశ్నించారు. గతంలో గ్రామ వాస్తవ్య పేరిట చేపట్టిన కార్యక్రమం ద్వారా జరిగిన ప్రగతిపై శే్వతపత్రం విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నారా? అని యెడ్యూరప్ప ముఖ్యమంత్రిని ప్రశ్నించారు.