జాతీయ వార్తలు

దిద్దుబాటు చర్యలే బీజేపీని గెలిపించాయి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 24: మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్‌గడ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన బీజేపీ వెంటనే లోపాలు గ్రహించి దిద్దుబాటు చర్యలు తీసుకుని లోక్‌సభ ఎన్నికల్లో ఘన విజయం సాధించిందని మధ్య ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ అన్నారు. అయితే ఈ మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ ఆ విజయోత్సవ భ్రమల్లోనే ఉండిపోయిందని ఆయన వ్యాఖ్యానించారు. పార్లమెంటు ఎన్నికల ఫలితాలు చాలా పార్టీలకు కనువిప్పు కలిగించాయని వ్యాఖ్యానించిన ఆయన ప్రజలు తమ తీర్పు ద్వారా దేశంలో అనువంశిక కుల రాజకీయాలకు చెల్లు చీటి పలికారని అన్నారు.ప్రజలు కుల, మతాలకు అతీతంగా, సంక్షేమం, అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని ఓట్లు వేశారని ఆయన తెలిపారు. దేశ రాజకీయ చరిత్రలో ఈ ఎన్నికలు ఓ అపూర్వ ఘట్టమని ఆయన సోమవారం పిటీఐ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. మధ్య ప్రదేశ్, చత్తీస్‌గడ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో తమ పార్టీ ఓటమి చవి చూసినా, లోక్‌సభ ఎన్నికల్లో విజృంభించిందని, 50 శాతానికి పైగా ఓట్లను పొందడం జరిగిందని ఆయన వివరించారు. మధ్యప్రదేశ్‌లో తమ పార్టీ 28 సీట్లలో విజయం సాధించగా, కాంగ్రెస్ పార్టీ చిందర్‌వాలా నియోజకవర్గంలో మాత్రమే గెలుపొందిందని ఆయన చెప్పారు.