జాతీయ వార్తలు

రింగ్ రోడ్డు అభివృద్ధికి కేంద్రం సిద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 24: రాష్ట్ర రాజధాని అమరావతి-విజయవాడ చుట్టూ రింగ్ రోడ్డును అభివృద్ధి చేసేందుకు కేంద్రం సిద్ధంగా ఉన్నదని కేంద్ర రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. వైఎస్‌ఆర్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు వి.విజయసాయిరెడ్డి సోమవారం రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు గడ్కరీ సమాధానమిస్తూ రింగ్ రోడ్డును అభివృద్ధి చేసే ప్రాజెక్టుకు తాము ఏనాడో ఆమోదం తెలిపాం.. అయితే ప్రాజెక్టుకు అవసరమైన భూమిని సేకరించనందున పనులు ప్రారంభం కాలేదని వెల్లడించారు.
భూసేకరణ ఖర్చును నూరు శాతం భరించేందుకు తొలుత అంగీకరించిన రాష్ట్ర ప్రభుత్వం ఆ తరువాత ఈ వ్యయంలో యాభై శాతం కేంద్ర ప్రభుత్వం భరించాలని అభ్యర్థించిందని గడ్కరీ చెప్పారు. అప్పటి ముఖ్యమంత్రి చేసిన ఈ ప్రతిపాదనకు అంగీకరించినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం తదుపరి చర్యలు తీసుకోలేదని మంత్రి చెప్పారు. కొత్త ప్రభుత్వం ఈ ప్రాజెక్టును అమలు చేసేందుకు ముందుకొస్తే వారితో ఎంఓయు చేసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని గడ్కరీ ప్రకటించారు.
ఇదే విధంగా అమరావతి-అనంతపురం గ్రీన్ ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ వే 384 కిలోమీటర్ల మేర నిర్మించాలని ప్రతిపాదించామన్నారు. ఈ ప్రాజెక్టుకు అవసరమయ్యే భూమిని సేకరించేందుకు అయ్యే ఖర్చులో 50 శాతం ఖర్చును కేంద్రమే భరిస్తుందని గడ్కరీ హామీ ఇచ్చారు. ప్రాజెక్టుకు అవసరమైన పర్యావరణం, అటవీ, వన్యప్రాణులు మొదలకు చట్టపరమైన అనుమతులను మాత్రం రాష్ట్ర ప్రభుత్వమే తెచ్చుకోవలసి ఉంటుందని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు.
భూసేకరణే అసలు సమస్య
విజయవాడ-అమరావతి రింగ్ రోడ్డు నిర్మాణానికి అవసరమైన భూసేకరణ సమస్యే పనులు ఆలస్యం కావడానికి కారణామని నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. మొదటగా ఈ రింగ్ రోడ్డు భూసేకరణకు అవసరమైన వ్యయాన్ని భరిస్తామని గత ప్రభుత్వం చెప్పిందని.. తరువాత ఖర్చును కేంద్రం-రాష్ట్రం చెరిసగం భరించాలని ప్రతిపాదించిందని అన్నారు. భూసేకరణ ములంగా ఖర్చు భారీగా పెరిగిపోయిందని, ప్రాజెక్టు ఖర్చు రూ.1800 కోట్లతే, ఒక్క భూసేకరణకే రూ.800 కోట్లు అవుతోందని అన్నారు. ఇటీవల ఏర్పడిన నూతన ప్రభుత్వంతో ఎంఓయూ చేసుకోవడానికి కేంద్రం సిద్ధంగా ఉందని గడ్కరీ పేర్కొన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా అమరావతి-అనంతపురం గ్రీన్‌ఫీల్డ్ రాహదారి నిర్మాణంలో భూసేకరణకు అయ్యే ఖర్చును పూర్తిగా కేంద్ర ప్రభుత్వం భరిస్తుందా అని విజయ సాయిరెడ్డి అడిగిన అనుబంధ ప్రశ్నకు కేంద్ర మంత్రి సమాధానం ఇచ్చారు. ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర వంటి రాష్ట్రాలు రింగ్ రోడ్లు నిర్మాణానికి కావల్సిన భూసేకరణకు అయ్యే ఖర్చులో 50 శాతం భరిస్తున్నాయని.. మిగిలిన రాష్ట్రాలు కూడా ముందుకు రావాలని అన్నారు. రాహదారుల నిర్మాణానికి కావాల్సిన భూసేకరణ ఖర్చు కేరళలో మరీ ఎక్కువగా ఉందని పేర్కొన్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ముందుకు రావాలని చెప్పారు. ప్రాజెక్టు వ్యయంలో రాష్ట్ర ప్రభుత్వం వసూలు చేస్తున్న 15% పన్నులు ఉపసంహరించుకుంటే దానికి ప్రతిగా ఆయా ప్రాజెక్టుల్లో రాష్ట్ర ప్రభుత్వానికి ఆ మేరకు వాటా ఇస్తామని గడ్కరీ పేర్కొన్నారు.