జాతీయ వార్తలు

28 వరకూ క్లాట్ రెండో దశ సీట్ల కేటాయింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 24: దేశవ్యాప్తంగా ఉన్న 21 న్యాయ విద్య విశ్వవిద్యాలయాల్లోనూ, డీమ్డ్ వర్శిటీలు, ప్రైవేటు వర్శిటీల్లో యూజీ, పీజీ సీట్ల రెండో దశ కేటాయింపుల ప్రక్రియను క్లాట్ కాన్సార్టియం పూర్తి చేసింది. తొలి దశ జాబితాను 14వ తేదీన విడుదల చేయగా, రెండో దశ జాబితాను ఆదివారం రాత్రి విడుదల చేసింది. మూడో జాబితాను ఈ నెల 28వ తేదీన విడుదల చేస్తుంది. ఎంపికై అభ్యర్థులు జూన్ 30వ తేదీలోగా అడ్మిషన్ పొందాల్సి ఉంటుంది. వచ్చే నెల 20 నాటికి ఆయా న్యాయ విద్యా విశ్వవిద్యాలయాలు తమ నివేదికలను క్లాట్ కన్సార్టియంకు పంపించాల్సి ఉంటుంది. తెలంగాణలో నల్సార్‌కు, ఆంధ్రాలో దామోదరం సంజీవయ్య న్యాయ విశ్వవిద్యాలయం, గీతం యూనివర్శిటీ, కేఎల్ యూనివర్శిటీ, ఇక్ఫాయి విశ్వవిద్యాలయాలు అడ్మిషన్లను చేపడుతున్నాయి.