జాతీయ వార్తలు

స్వచ్ఛ మహోత్సవ్‌లో ఐదు అవార్డులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 24: పరిసరాల పరిశుభ్రతలో మెరుగైన ఫలితాలు సాధించిన తెలంగాణ రాష్ట్రానికి జాతీయ స్థాయిలో ఐదు అవార్డులు లభించాయి. కేంద్ర జల వనరుల శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ నేతృత్వంలో స్వచ్ఛ మహోత్సవ్ అవార్డుల కార్యక్రమం ఢిల్లీలో జరిగింది. ప్రత్యేక వ్యక్తిగత విభాగంలో సిద్దిపేట, ఎర్రవల్లికి చెందిన మొండి భిక్షపతి, జగిత్యాల శాంతక్కపల్లికి చెందిన మొరపు రమ స్వచ్ఛ మహోత్సవ్ అవార్డులు అందుకున్నారు. అలాగే స్వచ్ఛత అంశంలో పెద్దపల్లి జిల్లాకు లభించిన అవార్డును ఆ జిల్లా కలెక్టర్ అందుకున్నారు. రాష్ట్ర స్థాయిలో లభించిన అవార్డును పంచాయతీ రాజ్ కమిషనర్ నీతు కుమారి ప్రసాద్ అందుకున్నారు. ప్రత్యేక జిల్లాల విభాగంలో వరంగల్ జిల్లాకు కూడా స్వచ్ఛ మహోత్సవ్ అవార్డ్ లభించింది. మొత్త ఐదు స్వచ్ఛ మహోత్సవ్ అవార్డులలో తెలంగాణ రాష్ట్ర దేశంలో రెండోస్థానంలో నిలిచింది.