జాతీయ వార్తలు

మోదీ ఒక్కడేనా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని స్వామి వివేకానందతో పోల్చటం ఎంతమాత్రం సబబు కాదని లోక్‌సభలో కాంగ్రెస్ పక్షం నాయకుడు అధీర్ రంజన్ చౌదరి స్పష్టం చేశారు. మోదీ ప్రభుత్వం గతంలో కాంగ్రెస్ అమలు చేసిన పలు పథకాల పేర్లు మార్చి అమలు చేస్తోంది తప్ప కొత్తగా ఏమీ చేయటం లేదని దుయ్యబట్టారు. నరేంద్ర మోదీతో పోల్చటం ద్వారా కేంద్ర సహాయ మంత్రి సారంగి స్వామి వివేకానందను అవమానించారని చౌదరి ఆరోపించారు. బీజేపీలో మోదీ మినహా మరో నాయకుడు లేడా.. అన్ని పనులూ ఆయనే చేస్తున్నాడా.. అన్ని పనులూ ఆయనకే ఎందుకు అప్పగిస్తున్నారని అధికార పక్షం సభ్యులను చౌదరి ప్రశ్నించారు. ‘్భరతీయులమని చెప్పుకునేందుకు గతంలో సిగ్గుపడేవారు.. ఇప్పుడు భారతీయులమని గర్వంగా చెప్పుకుంటున్నారు’ అని నరేంద్ర మోదీ 2015లో షాంఘైలో చేసిన ప్రకటనను చౌదరి ప్రస్తావిస్తూ భారతీయులైనందుకు మీరొక్కరే గర్విస్తున్నారా? మాజీ ప్రధాన మంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయి, ఆర్‌ఎస్‌ఎస్ అధినేత మోహన్ భాగవత్, వీర్ సావర్కర్ తదితరులు భారతీయులైనందుకు గర్వపడలేదా? మోదీ ఒక్కరే గర్వపడుతున్నారా? అని చౌదరి ప్రశ్నించారు. 2జీ తదితర కుంభకోణాల్లో తప్పు చేసి ఉంటే యూపీఏ చైర్‌పర్సన్ సోనియా గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ జైల్లో ఉండేవారు.. కానీ వారిప్పుడు బైటే ఉన్నారు ఎందుకు అని ఆయన ప్రశ్నించారు. వారు తప్పుచేయలేదు కాబట్టేనని ఆయన వివరణ ఇచ్చారు. నరేంద్ర మోదీ మంచి సేల్స్‌మెన్ కాబట్టే ఎన్నికల్లో విజయం సాధించారు. కాంగ్రెస్ పార్టీ మార్కెట్ చేయలేకోయింది కాబట్టే ప్రతిపక్షంలో ఉన్నామని అన్నారు. రాష్టప్రతి ప్రసంగంలో అధికార పక్షం తమను తాము మెచ్చుకోవటం మినహా మరేమీ లేదని విమర్శించారు. ప్రభుత్వం లేని గొప్పలు చెప్పుకుంటోందని అన్నారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైంది.. అభివృద్ధిని సాధించలేకపోయిందని అన్నారు. దేశంలోని పలు రాష్ట్రాల్లో విలయతాండవం చేస్తున్న కరవు గురించి ఎందుకు మాట్లాడటం లేదని ఆయన ప్రభుత్వాన్ని నిలదీశారు. సగం కంటే ఎక్కువ ప్రాంతాల్లో కరవు నెలకొన్నది.. రైతులు అష్టకష్టాల పాలవుతున్నారని చౌదరి చెప్పారు. మోదీ బాబా అన్ని చేస్తారని బీజేపీ ఎంపీలు భావిస్తున్నారు.. అందుకే సగటు మనిషి కష్టాల గురించి పట్టించుకోవటం లేదని ఆరోపించారు. మోదీ బాబాను పూజిస్తే అన్ని కష్టాల నుండి బైటపడతామని అనుకుంటున్నారంటూ చౌదరి వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ తరపున తక్కువ మంది ఎంపీలు గెలిచినా ప్రజల తరపున పోరాటం ఆగదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ రాష్టప్రతి రామ్‌నాథ్ కోవింద్‌ను విమర్శించదు.. కానీ మోదీ ప్రభుత్వం తప్పులను ఎత్తిచూపిస్తుందని చౌదరి ప్రకటించారు. మోదీ ప్రభుత్వం తప్పులను ఎత్తిచూపించేందుకే రాష్టప్రతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానానికి పలు సవరణలు ప్రతిపాదించినట్లు ఆయన తెలిపారు. రాష్టప్రతి ప్రసంగంలో ఇచ్చిన వివరాలు తప్పుల తడక అని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వాలు సాధించిన విజయాలను చౌదరి వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం టెలికాం విప్లవం తీసుకురాటం మరిచిపోయారా అని ఆయన ప్రశ్నించారు. మోదీ ప్రభుత్వం ఏ విప్లవం తెచ్చిందని ఆయన ప్రశ్నించారు. మాజీ ప్రధాన మంత్రి రాజీవ్ గాంధీ మూలంగానే దేశంలో డిజిటల్ విప్లవం వచ్చిందన్నారు. పక్కన కూర్చున్న సోనియా గాంధీ ఆయనకు పలు విషయాలు సూచిస్తూ వాటి గురించి చెప్పించారు. కాంగ్రెస్ ప్రారంభించిన పథకాలను మోదీ ప్రభుత్వం పేరు మార్చి అమలు చేసిందని చౌదరి ఆరోపించారు. మోదీ ప్రభుత్వం ‘పొలిటికల్ ప్లేగరాయిజం’ ప్రారంభించిందని ఆయన దుయ్యబట్టారు.

చిత్రం...లోక్‌సభలో కాంగ్రెస్ పక్షం నేత అధీర్ రంజన్ చౌదరి