జాతీయ వార్తలు

హరిద్వార్ స్వామి గిరి మహారాజ్ కన్నుమూత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డెహ్రాడూన్, జూన్ 25: హరిద్వార్‌కు చెందిన ప్రసిద్ధ పీఠాధిపతి స్వామి సత్యమిత్రానంద్ గిరి మహారాజ్ (87) మంగళవారం ఇక్కడ కన్నుమూశారు. ఆయన చాలా కాలం నుంచి అస్వస్తుతులుగా ఉన్నారు. భారత్ మాతా జనహిత్ ట్రస్ట్ అధిపతి గిరిస్వామికి ఆసుపత్రిలో సేవలందించినట్టు ఆచార్య మహామండలేశ్వర్ స్వామి అవ్‌దేశానంద గిరి వెల్లడించారు. హరిద్వార్‌లోని రాఘవ్ కుటీర్‌లో బుధవారం అంత్యక్రియలు నిర్వహిస్తారని అన్నారు. కాగా సత్యమిత్రానంద్ గిరి మృతికి పలువురు ప్రగాఢ సంతాపం తెలిపారు. రాజకీయ, మతపెద్దలు సంతాప సందేశాలు తెలిపారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్యాత్మిక గురువుకు శ్రద్ధాంజలి ఘటించారు. గిరిజనులు, పేద ప్రజలకు గిరిస్వామి ఎన్నో సేవలందించారని వారు ప్రస్తుతించారు. ‘ భారత మాత ఆలయం నిర్మించి ఆధ్యాత్మిక సేవలందించారు. ఆయన నిజమైన ఆధ్యాత్మిక గురు’అని ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. సమన్వయ సేవా సంస్థను స్థాపించి పేదలకు విద్య, ఉచితంగా వైద్య సేవలు అందించారని, గిరిజనులకు ఆయన నిజమైన ఆరాధ్య దైవంగా ఉపరాష్ట్రపతి అభివర్ణించారు. గిరి మహారాజ్ ఆత్మకు శాంతి కలగాలంటూ ప్రధాని తన సందేశంలో పేర్కొన్నారు.

చిత్రం... హరిద్వార్‌లో గిరి మహారాజ్ భౌతిక కాయానికి నివాళులు అర్పిస్తున్న సాధువులు