జాతీయ వార్తలు

లబ్ధిదారుల నుంచే కమీషన్లా..?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా, జూన్ 25: ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను లబ్దిదారుల నుంచి కమీషన్లు తీసుకున్న ప్రజాప్రతినిధులు, అధికారులపై పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కొరడా ఝుళిపించింది. వీరిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని, నేరం రుజువైతే యావజ్జీవ కారాగార శిక్ష పడే అవకాశం ఉందని అధికారవర్గాలు తెలిపాయి. భారత శిక్షాస్మృతిలోని 409 సెక్షన్ ప్రకారం ఇలాంటి వారిపై కేసులు పెడతామని, తప్పు చేసిన వ్యక్తి బ్యాంక్ అధికారి అయినా, వ్యాపారస్తుడైనా, చివరకు ప్రభుత్వ అధికారులైనా నేరం రుజువైతే శిక్షను అనుభవించాల్సిందేనని ఈ వర్గాలు తెలిపాయి. ఆయా నేర తీవ్రతను బట్టి యావజ్జీవం నుంచి పదేళ్ళ వరకు శిక్ష పడేందుకు ఈ చట్టం కింద నమోదయ్యే కేసులు వీలు కల్పిస్తాయని తెలిపాయి. ఇందుకు సంబంధించిన నిర్ణయాన్ని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీసుకున్నారని వెల్లడించాయి. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పలు సంక్షేమ పథకాల లబ్ది తమకు చేకూర్చేందుకు వీరు కమీషన్ తీసుకున్నారని ఆరోపించిన ప్రజలు ఆ మొత్తాన్ని తిరిగి ఇచ్చేయాలని డిమాండ్ చేసిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇటీవల జరిగిన సమావేశంలో మాట్లాడిన మమతా బెనర్జీ ప్రజల నుంచి తీసుకున్న ఈ మొత్తాన్ని వెంటనే తిరిగి ఇచ్చేయాలని ఆదేశించారు. తన పార్టీలో ఈ రకమైన దొంగలు ఉండడాన్ని తాను సహించనని ఆమె హెచ్చరించారు. ఒకవేళ తాను ఇలాంటి వారిపై చర్య తీసుకుంటే వారు మరో పార్టీలో చేరుతారు కాబట్టి దోషులుగా నిర్ధారించబడిన వారు చట్ట ప్రకారం శిక్షను ఎదుర్కొవాల్సిందేనని ఆమె తెలిపారు. ప్రభుత్వ పథకాల కింద హౌసింగ్ గ్రాంట్లు ఇవ్వాలంటే కొంత మంది నేతలు 25 శాతం కమీషన్ తీసుకున్నట్లుగా తన దృష్టికి వచ్చిందన్నారు. ఇలా కమీషన్లు తీసుకున్న వారిపై ఫిర్యాదులు దాఖలైన తర్వాత దర్యాప్తు జరుపుతామని, తప్పు జరిగినట్లు రుజువైతే చర్యలు తీసుకుంటామని ఓ సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. ఈ కమీషన్లకు సంబంధించి దాఖలైన ఫిర్యాదులను స్వీకరించాలని అన్ని జిల్లాల పోలీసు అధికారులను ప్రభుత్వం ఆదేశించింది.
చిత్రం... కమీషన్లకు నిరసనగా కోల్‌కతాలో ప్రదర్శన చేస్తున్న కాంగ్రెస్, సీపీఎం ఎమ్మెల్యేలు