జాతీయ వార్తలు

మూడేళ్లలో 700 మంది ఉగ్రవాదులు ఖతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 25: గత మూడేళ్లలో 700 మందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి మంగళవారం వెల్లడించారు. లోక్‌సభలో మంగళవారం కిషన్ రెడ్డి లిఖితపూర్వకంగా ఇచ్చిన నివేదికలో ఈ వివరాలను తెలియజేశారు. కేవలం ఈ సంవత్సరం జూన్ 16 నాటికి 113 మంది ఉగ్రవాదులను భారత సైన్యాలు హతమార్చాయని ఆయన స్పష్టం చేశారు. మొత్తంగా మూడేళ్లలో 733 మంది ఉగ్రవాదులను భద్రతా దళాలు హతమార్చాలని చెప్పారు. పరస్పర దాడుల్లో 112 మంది పౌరులు కూడా మరణించారని ఆయన పేర్కొన్నారు. ‘ఉగ్రవాదాన్ని పూర్తిగా నిర్మూలించడమే ధ్యేయంగా కేంద్ర ప్రభుత్వం పనిచేస్తోంది.. టెర్రరిజాన్ని అంతమొందించేందుకు భద్రతా దళాలు తీవ్రంగా కృషి చేస్తున్నాయనడానికి ఈ సంఖ్యే నిదర్శనం’ అని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. ఉగ్రవాదానికి సహకరించే వ్యక్తులను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలేది లేదని.. కఠిన చర్యలు తీసుకొంటామని ఆయన హెచ్చరించారు.