జాతీయ వార్తలు

పెట్రో కెమికల్ కాంప్లెక్స్ ఏర్పాటుకు కేంద్రం సిద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో గ్రీన్‌ఫీల్డ్ రిఫైనరీ, పెట్రో కెమికల్ కాంప్లెక్స్ ఏర్పాటుకు కేంద్రం సిద్ధంగా ఉన్నది.. అయితే రాష్ట్ర ప్రభుత్వం వయబిలటీ గ్యాప్ ఫండింగ్ సమకూర్చేందుకు ముందుకు రావాలని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. రాజ్యసభలో విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు ధర్మేంద్ర ప్రధాన్ రాతపూర్వకంగా సమాధానం ఇస్తూ రాయితీ ధరలకు నీరు, విద్యుత్ తదితర ప్రోత్సాహకాలతోపాటు ఐదువేల కోట్ల రూపాయల వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ సమకూర్చటం, అవసరమైన అనుమతులు పొందేందుకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించవలసి ఉంటుందని స్పష్టం చేశారు. ఏపీ విభజన చట్టంలో పొందుపరిచిన హామీ ప్రకారం ఏడాదికి 1.7 మిలియన్ టన్నుల ఉత్పాదక శక్తి గల పెట్రో కెమికల్ కాంప్లెక్స్‌పై 2017లోనే డీపీఆర్‌ను సిద్ధం చేసినట్లు మంత్రి చెప్పారు. ప్రాజెక్టుకు సంబంధించిన ఆర్థిక మదింపు అధ్యయనం కూడా పూర్తయిందన్నారు. ప్రాజెక్టు మొత్తం వ్యయం రూ.32,901 కోట్లు అవుతుందని మంత్రి చెప్పారు. రిఫైనరీ, పెట్రోకెమికల్ ప్రాజెక్టులకు భారీ పెట్టుబడులు అవసరం, ఈ ప్రాజెక్టులకు నీరు, విద్యుత్‌పై రాయితీలు అవసరమని మంత్రి అభిప్రాయపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం వయబిలిటీ ఫండింగ్ కూడా చేయవలసి ఉంటుందని ప్రధాన్ స్పష్టం చేశారు. రిఫైనరీ. పెట్రోకెమికల్ ప్రాజెక్టు ఏర్పడితే రాష్ట్రానికి ఎంతో మేలు జరుగుతుంది.. యువతకు ఉపాధి అవకాశాలు బాగా పెరుగుతాయని మంత్రి తెలిపారు.