జాతీయ వార్తలు

బీజేపీలోకి లంకా దినకర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 26: తెలుగుదేశం అధికార ప్రతినిధి లంకా దినకర్ బుధవారం బీజేపీ కార్య నిర్వాహక అధ్యక్షుడు జగత్‌ప్రకాశ్ నడ్డా సమక్షంలో బీజేపీలో చేరిపోయారు. దినకర్ తన రాజీనామా లేఖను టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుకు పంపించినట్లు తెలిసింది. ఇదిలా ఉంటే తెలుగుదేశం రేపల్లె శాసన సభ్యుడు అనగాని సత్యప్రసాద్, మరో ఇద్దరు శాసన సభ్యులు కూడా బీజేపీ తీర్థం పుచ్చుకుంటారని కథనాలు వెలువడ్డాయి. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న సత్యప్రసాద్, ఇతర శాసన సభ్యులు బీజేపీ సీనియర్ నాయకులతో సమావేశమై తమ చేరిక గురించి చర్చించినట్లు చెబుతున్నారు. ఇప్పటికే టీడీపీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులు బీజేపీలో చేరిపోయిన సంగతి తెలిసిందే.