జాతీయ వార్తలు

మధ్యప్రదేశ్‌లో బీజేపీ ఎమ్మెల్యే వీరంగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇండోర్, జూన్ 26: మధ్య ప్రదేశ్‌లో బీజేపీ ఎమ్మెల్యే ఆకాశ్ విజయ్‌వర్గీయ వీరంగం సృష్టించారు. ఇందులో ఆయన కుమారుడు కైలాష్ విజయవర్గీయ కూడా తోడయ్యాడు. ఇండోర్‌లోని గంజ్ ప్రాంతంలో శిథిలావస్థలో ఓ భవనాన్ని కూల్చి వేసేందుకు ఇండోర్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారి సిబ్బందిని వెంట పెట్టుకుని ఆ ప్రాంతానికి చేరుకున్నారు. దీంతో ఎమ్మెల్యే ఆకాశ్ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడే పిల్లలు ఆడుకుంటున్న క్రికెట్ బ్యాట్ చేతిలో తీసుకుని వీరంగం సృష్టించాడు. ఆయన కుమారుడు కూడా వీరంగం సృష్టిస్తూ కూల్చి వేతను అడ్డుకున్నారు. ఎమ్మెల్యే ఆకాశ్ కుమారుడు కైలాష్ స్థానిక బీజేపీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. ఎమ్మెల్యే, ఆయన కుమారుడు మున్సిపల్ సిబ్బందిని అడ్డుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.