జాతీయ వార్తలు

రాహుల్ ట్విట్టర్ ఫాలోవర్లు పది మిలియన్ల పైనే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 10: కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీకి ట్విటర్‌లో ఫాలోవర్ల సంఖ్య పది మిలియన్ల మైలురాయిని అధిగమించింది. ఈ సందర్భంగా బుధవారం రాహుల్ తన ట్విటర్ ఫాలోవర్లు అందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. సామాజిక మాధ్యమమే వేదికగా ఈ మైలురాయిని అధిగమించడం తనకెంతో ఆనందాన్నిచ్చిందని ఆయన చెప్పారు. కాంగ్రెస్ నేతల్లో అంతకుముందు శశిధరూర్‌కు ట్విటర్‌లో ఫాలోవర్ల సంఖ్య ఎక్కువగా ఉండేది. శశిధరూర్‌కు 6.9 మిలియన్ల మంది ట్విటర్ ఫాలోవర్లు ఉన్నారు. ఇదిలా ఉంటే ప్రధాని నరేంద్ర మోదీతో పోలిస్తే ట్విటర్ల ఫాలోవర్ల సంఖ్య రాహుల్‌కు తక్కువేనని చెప్పాలి. ఎందుకంటే మోదీకి ట్విటర్‌లో 48 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. ‘నా ఫాలోవర్ల సంఖ్య పది మిలియన్లకు చేరింది. అందుకు ప్రతి ఒక్కరికీ పేరు పేరునా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా’ అని రాహుల్ పేర్కొన్నారు. ఈ మైలురాయిని అధిగమించిన సందర్భంగా అమేధిలో కాంగ్రెస్ కార్యకర్తలు, మద్దతుదార్లతో బుధవారం సమావేశవౌతున్నట్లు రాహుల్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో అమేథిలో రాహుల్‌గాంధీ కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ చేతిలో పరాజయం చెందిన సంగతి తెలిసిందే. అయితే, కేరళలోని వయనాడ్ పార్లమెంట్ స్థానం నుంచి నాలుగు లక్షలకు పైగా మెజారిటీతో రాహుల్ గెలుపొందారు.