జాతీయ వార్తలు

చిన్నారి పెళ్లికూతురు నటి ప్రత్యూష ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఏప్రిల్ 1: బాలికావధుతోపాటు ఎన్నో సీరియళ్లలో నటించి ఇంటింటినీ ఆకట్టుకున్న ఓ ఉజ్వల నటి భవిషత్ అర్ధాంతరంగా అంతమైంది. ఈ సీరియల్‌లో ఆనంది పాత్రతో ప్రతి ఒక్కరినీ మెప్పించిన నటి ప్రత్యూష బెనర్జీ శుక్రవారం ఉదయం ఆత్మహత్య చేసుకుంది. ఈ వార్త ఇటు టివి ప్రేక్షకులనే కాకుండా ఆమె సీరియల్‌ను వదిలిపెట్టకుండా చూసిన ప్రతిఒక్కరినీ కంటతడి పెట్టించింది.ప్రత్యూష బెనర్జీ ఉరేసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించారని ఆసుపత్రికి తీసుకెళ్లేలోగానే మరణించినట్టు చెబుతున్నారు. వ్యక్తిగత జీవితంలో తలెత్తిన సమస్యలే ఈ తీవ్ర నిర్ణయానికి కారణమైనట్టుగా తెలుస్తోంది. తన బాయ్ ఫ్రెండ్ రాహుల్ రాజ్ సింగ్‌కు సంబంధించి అనేక అంశాలు ప్రత్యూష బెనర్జీని తీవ్ర మనస్తాపానికి గురిచేశాయి. త్వరలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకుంటారన్న ప్రచారమూ జరిగింది. బెనర్జీ ఆత్మహత్య చేసుకున్న విషయం తనకు తీవ్ర దిగ్భ్రాంతి కలిగించిందని ఆమెతో పాటు బాలికావధులో నటించిన సిద్ధార్థ శుక్లా తెలిపారు. దేశ వ్యాప్తంగా ఎంతో ప్రజాదరణ పొందిన ఈ సీరియల్ తరువాత ప్రత్యూష బెనర్జీ రియాల్టీషోలపై దృష్టిపెట్టారు. బిగ్‌బాస్-7లో కూడా పాల్గొన్నారు. చివరిసారిగా ససురాల్ సిమ్మర్కా అనే సీనియల్‌లో నటించారు. గత కొన్ని నెలలుగా ఆమె వ్యక్తిగత జీవితం వివాదాస్పంగా మారింది. ఎనిమిది మంది వ్యక్తులు పోలీసులుగా తనను వేధిస్తున్నారని ఆరోపించింది. అలాగే ఆమె బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి చేసుకున్న పుట్టిన రోజు పార్టీకి ఆయన సొమ్ములు చెల్లించలేదని కూడా ప్రత్యూషపై వచ్చాయి.