జాతీయ వార్తలు

తెలంగాణ పథకాలు భేష్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ : తెలంగాణ ప్రభుత్వం అనేక ప్రయోగాత్మక సంక్షేమ కార్యక్రమాలను చేపడుతోందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అభినందించారు. బుధవారం 2019-20 బడ్జెట్‌పై జరిగిన చర్చకు బదులిస్తున్న సమయంలో లోక్‌సభలో టీఆర్‌ఎస్ పక్షం నాయకుడు నామా నాగేశ్వరరావు జోక్యం చేసుకుని కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ప్రకటించిన ఇంటింటికి మంచినీటి పథకాన్ని తమ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ఎప్పుడో చేపట్టారని అన్నారు. దీనికి నిర్మలా సీతారామన్ బదులిస్తూ తెలంగాణ ప్రభుత్వం ప్రయోగాత్మక సంక్షేమ పథకాలు చేపడుతోందంటూ ప్రశంసలు కురిపించారు. తెలంగాణకు సంబంధించిన నామా లేవనెత్తిన అంశాలను పరిగణనలోకి తీసుకుంటామని హామీ ఇచ్చారు. బడ్జెట్‌లో తెలంగాణకు తీరని అన్యాయం జరిగిందని నామా ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వం రైతులకు ఎకరానికి పదివేల రూపాయల పెట్టుబడి సహాయం చేస్తోంది.. కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ప్రతిపాదించిన ‘హర్ ఘర్ జల్’ పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం ఎప్పుడో చేపట్టి ఇప్పుడు ప్రతి ఇంటికీ నీరందిస్తోందని అన్నారు. తెలంగాణ ప్రభుత్వ పథకాలకు కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వాలని నామా నాగేశ్వరరావు నిర్మలా సీతారామన్‌ను కోరారు.